గూగుల్ లో సన్నీ లియోన్ ఎప్పుడు టాప్ ఏ ..!

guyyala Navya
మనకు తెలియనిది ఏదైనా తెలుసుకోవాలంటే ఒకప్పుడు పక్కన ఉన్న మిత్రుడినో లేదా అన్ని నాకు తెలుసు అనుకునే వ్యక్తినో కలిసి కాసేపు మాట్లాడి సమాచారాన్ని తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆలా కాదు ఒక డౌట్ వచ్చింది అంటే చాలు ఇంటర్నెట్ ఆన్ చేసి 'ఓకే గూగుల్, టెల్ మీ దిస్' అంటూ గూగుల్ సెర్చ్ చేసేస్తాం. 


ఆలా మన లైఫ్ లో ఖచ్చితంగా ఉండాల్సిన వాటిలో గూగుల్ అనేది కీలకమైనది. పిల్లలకు ఆహారం ఎం పెట్టాలి అనే దాని నుంచి కెరియర్ లో ఏది ఎంచుకోవాలి అనే వరుకు అన్నింటికి సమాచారం ఇస్తూ మనకు గూగుల్ ఏ సహాయం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ లో సినీ తారల కోసం అభిమానులు ఓ రేంజ్ లో సెర్చ్ చేసేస్తుంటారు. 


విషయానికో వస్తే .. ఈ సంవత్సరానికి గాను గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలెబ్రెటీలలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది సన్నీ లియోన్. ఈ సంవత్సరానికి అత్యధిక మంది వెతికిన సెలెబ్రెటీలలో మోడీ, సచిన్, సల్మాన్ కన్నా ముందుంది సన్నీ లిస్ట్. గూగుల్ ఎనలిటికల్ లిస్ట్ ప్రకారం.. చాలా మంది సన్నీకి సంబందించిన ఫోటోలను, వీడియోలను, ఆమె జీవిత విశేషాల గురించి అలాగే ఆమె బయోపిక్ సిరీస్‌ 'కరణ్‌జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోనీ', సన్నీ కుటుంబీకుల గురించే నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేశారట. 


ఈ విషయం పై స్పందించిన సన్నీ మాట్లాడుతూ..  'గూగుల్ లో నా గురించి చాలా వెతికారని తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా వాళ్లకు నా మీదున్న అభిమానం' అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం సన్నీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది, 'కోకాకోలా'  అనే సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తర ప్రదేశ్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: