చ‌రిత్ర‌లోనే జ‌గ‌న్ తొలి రికార్డు... ప‌ట్టుబ‌ట్టి సాధించిన నేత‌

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. చ‌రిత్ర‌లోనే రికార్డు సృష్టించారా?  దేశంలోని ఏరాష్ట్రంలోనూ ఏ ప్ర‌భుత్వ‌మూ సాధించ‌ని రికార్డును ప్ర‌బుత్వంలోకి వ‌చ్చిన రెండు మాసాల్లోనే ఆయ‌న సాధించారా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీ ల‌కులు. మ‌రి జ‌గ‌న్ సాధించిన ఆ రికార్డు ఏంటి? అనేవిష‌యాన్ని ప‌రిశీలిస్తే.. చాలా ఆస‌క్తిక‌ర విష‌యం వెలు గు చూస్తోంది. త‌ను ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు మాసాల్లోనే రికార్డు సృష్టించారు. ప్ర‌స్తుతం దేశాన్ని నిరుద్యోగం ఎంత‌గా పీడిస్తోందో అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డిక‌క్క‌డ చ‌దువుకున్న వారునిరుద్యోగు లుగా మారి పోతున్నారు. 


ఈ నేప‌థ్యంలోనే కేంద్రం స‌హా రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిరుద్యోగ స‌మ‌స్య‌ను కూడా ఎన్నిక‌ల్లో త‌మ‌కు అన‌కూ లంగా మార్చుకుంటున్నాయి. త‌మ ఐదేళ్ల పాల‌న‌లో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం.. అన్ని ఉద్యోగాలు ఇస్తాం.. అంటూ పెద్ద ఎత్తున హామీ ఇస్తున్నారు. అయితే, తాజాగా ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నిరు ద్యోగాన్ని త‌గ్గిస్తామ‌ని హామీ ఇచ్చినా.. ఎక్క‌డా అన్ని ఉద్యోగాలు ఇస్తాం.. ఇన్ని ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న కొన్నాళ్ల‌పాటు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 


అయితే, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే నిరుద్యోగంపై స‌మ‌ర‌భేరి మోగించారు. అది కూడా రికార్డు స్థాయిలో ల‌క్షా 40 వేల గ్రామ స‌చివాల‌య ప‌ర్మినెంట్ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందులోనూ మ‌రో రికార్డు ఉంది. కేవ‌లం రెండు మాసాల్లోనే నియామ‌క ప్ర‌క్రియ‌కు ఆయ‌న రూప‌క‌ల్ప‌న చేశారు. నిజానికి గ‌తంలో ఏ ప్ర‌బుత్వ‌మూ ఇంత వేగంగా ఇన్ని ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యో గాల‌ను చేప‌ట్టిన ప‌రిస్థితి లేదు. 


చంద్ర‌బాబు హ‌యాంలో అయితే, ఐదేళ్ల కాలానికి ఇచ్చిన ఉద్యోగాలు నా లుగున్న‌ర ల‌క్ష‌లు. కానీ, జ‌గ‌న్ హ‌యాంలో రెండు నెల‌లు తిరిగేస‌రికి  4 ల‌క్ష‌ల‌పైచిలుకు గ్రామ వ‌లంటీ ర్లు(నాన్ ప‌ర్మినెంట్‌), ల‌క్షా 40 వేల ప‌ర్మినెంట్ ఉద్యోగాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ నిర్ణ‌యం రికార్డు సృష్టించింద‌ని సాక్షాత్తూ కేంద్రం స‌హా పక్క‌రాష్ట్రాల ప్ర‌భుత్వాలే మెచ్చుకుంటున్నాయి. ఇక‌, విప‌క్షాలు కూడా ఈ విష‌యం ఎక్క‌డా విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం లేక మౌనం వ‌హిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: