బాబు జుట్టు పీక్కుంటున్న ప్రశ్నకు.. ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది..?

Chakravarthi Kalyan

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కొన్నాళ్లుగా ఓ ప్రశ్న వేధిస్తోంది. దాదాపు 60 రోజులుగా ఆ ప్రశ్నకు సమాధానం దొరకక ఆయన ఎంతో మనోవేధనకు గురవుతున్నారు. ఎంత ఆలోచించినా ఆయనకు సమాధానం మాత్రం దొరకడం లేదు.. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో తెలుసా... ఐదేళ్లపాటు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా ..ఎందుకు జనం ఓడించారు..?


మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉంటే.. ఎందుకు కేవలం 23 సీట్లే గెలిపించారు. అంతగా పాపం.. తాను చేసిన తప్పేమిటి.. రాష్ట్రం కోసం పాటుపడటమే నేరమా.. ఇరవై నాలుగు గంటలు.. జనం కోసం ఆలోచించడమే చంద్రబాబు చేసిన తప్పా.. ఇదీ చంద్రబాబు ఆళోచనాధోరణి. ఇదే ప్రశ్న ఆయన దాదాపు ప్రతి సమావేశంలోనూ కార్యకర్తలను అడుగుతున్నారు.


పాపం.. అంతా చంద్రబాబు పట్ల జాలి చూపేవారే కానీ.. సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు. కానీ..ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అదేంటో తెలుసా.. మొన్నటి ఎన్నికల్లో సామాజిక సమతుల్యం పాటించలేదట. అందుకే ఓడిపోయారట. ఈ మాటలు చెబుతున్నది ఎవరో కాదు.. ఎవరో చెబితే మాత్రం చంద్రబాబు ఎందుకు నమ్ముతారు? చెప్పింది... ఆయన సొంత పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులే.


ఎన్నికల సమయంలో అన్ని సామాజిక వర్గాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్ని వర్గాలు వైపు ఎక్కువగా మొగ్గారట చంద్రబాబు.. అందుకే ఓడిపోయారట. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలు, మాదిగ సామాజిక వర్గ ఓట్లు చెదిరిపోవడం వల్లే ఘోరంగా దెబ్బతిన్నామని చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు చెప్పారట.


అంతే కాదట.. వైసీపీ లాగా టీడీపీ ఎక్కువగా డబ్బు ఖర్చుచేయకపోవడం వల్లే ఓడిపోయారట. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయిందట. ఇతర సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే బీసీ, మాదిగ సామాజిక వర్గాల ఓట్లలో చీలిక వచ్చిందట. ఇవీ చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు చెప్పిన సమాధానాలు..మరి ఇప్పుడైనా చంద్రబాబు వీరి సమాధానంతో సంతప్తి పడతారో లేక.. మరోసారి..ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదని బాధపడతారో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: