వైగోకు దిమ్మతిరిగే షాక్.. దేశద్రోహం కింద ఏడాది జైలు శిక్ష!

Edari Rama Krishna

దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక లెక్క అయితే..తమిళ రాజకీయాలు మరో లెక్క అనేలా ఉంటాయి.  గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఉన్న సమయంలో డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే మద్య ఓ రేంజ్ లో యుద్దం కొనసాగుతూ ఉండేది.  ఆ సమయంలో మరో పార్టీ తెగ హడావుడి చేసేది..అదే ఎండీఎంకే. 

 

ఈ పార్టీ అధినే త వైగో (వి.గోపాలస్వామి) అప్పట్లో ఎన్నో కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండే వారు. తాజాగా తమిళనాడు రాజకీయవేత్త, ఎండీఎంకే అధినేత వైగో (వి.గోపాలస్వామి)కు చెన్నైలోని ఓ కోర్టు షాకిచ్చింది. దేశద్రోహం కింద ఏడాది జైలుశిక్షను విధించింది. వివరాల్లోకెళితే.. 2009లో తన పుస్తకం విడుదల సందర్భంగా వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎల్టీటీఈకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపకపోతే భారత్ ఎంతో కాలం ఒక దేశంగా ఉండలేదు' అని ఆయన అప్పుడు వ్యాఖ్యానించారు.

 

ఈ నేపథ్యంలో, భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారంటూ ఆయనపై కేసు నమోదైంది.  ట్విస్ట్ ఏంటేంటే..వైగోకు వ్యతిరేకంగా డీఎంకే కేసు వేసింది. ప్రస్తుతం సంకీర్ణ కూటమిలో భాగంగా రాజ్యసభ అభ్యర్థిగా వైగోను అదే డీఎంకే ప్రతిపాదించింది. లోక్ సభ ఎన్నికల్లో ఎండీఎంకేతో డీఎంకే పొత్తు పెట్టుకుంది.

 

రేపు ఆయన నామినేషన్ వేయాల్సి ఉంది. ఒకవేళ ఆయనే కనుక గెలిచినట్లయితే..దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత వైగో పార్లమెంటులో అడుగుపెడతారు. అయితే  ఎండీఎంకే కి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ..పొత్తు కారణంగా ఒక రాజ్యసభ స్థానాన్ని ఎండీఎంకేకు డీఎంకే కేటాయించింది. ఇంతలోనే అనుకున్నదొక్కటీ..అయ్యిందొక్కటీ అన్న చందంగా దేశద్రోహం కింద ఏడాది జైలుశిక్షను విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: