ఉత్తుత్తి కాబినెట్ మీట్ కు అనుమతి: నిర్ణయాల అమలుకు అనుమతి అవసరం: బాబు పంతం నెగ్గింది అంతే

గత కొద్దిరోజులుగా ఏపిలో ఉత్కంఠ రేపుతున్న మంత్రి మండలి సమావేశం (కేబినెట్ మీటింగ్) పై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చేసింది.  మంత్రి మండలి సమావేశం నిర్వహించుకోవటానికి కొన్ని షరతులతో కూడిన అనుమతి ని ఇచ్చింది. దరిమిలా మంగళవారం (14.05.2019) సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుందని తెలుస్తుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న క్రింద వివరించిన ప్రత్యేక అంశాలను మాత్రమే చర్చించాలి: 


*కఱువు,

*నీటి ఎద్దడి,

*పశుగ్రాసం కొరత,

*ఫణి తుఫాను సహాయ పునరావాస చర్యలు,

*ఉపాధి హామీ పనులకు నిధుల చెల్లింపు

 

మంత్రి మండలి సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన విషయం తెలిసిందే. మంత్రి మండలి సమావేశానికి సంబంధించి ప్రభుత్వం పంపిన ఎజెండాలోని అంశాలకు కూడా ఈసీ ఆమోదం తెలిపింది. అయితే సోమవారం సాయంత్రానికి అనుమతి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ప్రభుత్వం అనుకున్నట్లే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం ఈ రోజే (సోమవారం) తెలిపింది.


ఈ నెల 10న సాయంత్రం మంత్రి మండలి సమావేశం అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి 'రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది' పంపారు. ఈనెల 10 న కేబినెట్ జరపాల్సి ఉంది. అయితే భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు ఈసీకి పంపి, అనుమతి తీసుకున్న తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించ వలసిన పరిమితుల కారణంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తదనుగుణంగా ఈసీకి రికమండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంత్రి వర్గ ఎజెండాకు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. 


అయితే ఇందులో:

* కొత్త నిర్ణయాలకు,

*రేట్లమార్పుకు,

*బకాయిల చెల్లింపులకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది.

*బకాయిల చెల్లింపులకు అవసరమైతే ఎన్నికల సంఘం అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఈసీ అనుమతి తర్వాతనే ఏ చెల్లింపులైనా అమలు చేయాలని పేర్కొంది.

*మంత్రి మండలి సమావేశం అనంతరం నిర్ణయాలపై ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించకూడదని ప్రధాన ఆంక్షలు విధించింది.


మంత్రిమండలి సమావేశం ఉపయోగం "ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడ్ అమలులో ఉన్నప్పటికీ కేబినెట్ సమావేశం నిర్వహించారనే తన పంతం నెగ్గించుకున్నారు" ఎలాంటి ఆర్ధిక అనుమతులు లేవు. ప్రయోజనాలు శూన్యం"  బోనస్ గా ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించకూడదని ప్రధాన ఆంక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: