ప్రియుడితో బ్రేకప్ పై మొదటి సారి స్పందించిన జబర్దస్త్ ఫైమా..!?

Anilkumar
పటాస్ ప్రవీణ్ ఫైమా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో వీరిద్దరూ పండించే కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త కొంత కాలానికి ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫైవ్  స్వయంగా ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నాను అన్న విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. కానీ ఏమైందో తెలియదు కానీ కొన్నాళ్లుగా వీరిద్దరూ మాత్రం ఎక్కడా కూడా కలిసి కనిపించడం లేదు.

కొంతకాలంగా ఈ జంట అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బయటకి వెళ్లిన కూడా వీళ్ళిద్దరూ కలిసికట్టుగా కనిపించడం లేదు. అసలు కలిసి వీళ్లిద్దరూ మాట్లాడుకున్నట్లుగా కూడా ఎక్కడ కనిపించిన దాఖలు లేవు. దాంతో వీరిద్దరూ పలు కారణాల వల్ల విడిపోయారు అన్న వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం పటాస్ జబర్దస్త్ వంటి షో లతో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది. ఈ క్రమంలోనే పటాస్ ప్రవీణ్ తో ప్రేమాయణం నడిపింది. ఇందులో భాగంగానే ఒక ప్రముఖ యూట్యూబ్

ఛానల్ కి వీళ్ళిద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి కూడా చెప్పుకొచ్చారు. అందుకే నిజంగానే ప్రేమించుకుంటున్నారు అని అనుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ.. ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, అవి చెప్పుకోలేనివని పేర్కొంది. ఆ కారణాల వల్లనే నేను అతనికి దూరం కావాల్సి వచ్చింది అని తెలియజేసింది.. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే మాటలు సింపథికీ దారితీస్తాయి. అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదని.. ఫైమా పేర్కొంది. ఆమె మాట తీరుని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య పెద్ద గొడవలే జరిగాయని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: