సుమలత తరపున ప్రచారం చేసినందుకు "కేజేఫ్ హీరో యశ్" పై సిఎం ఫైర్

కాంగ్రేస్ చేతగానితనం రాహుల్ గాంధి అసమర్దత కర్ణాటకలో హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకేం నడమంత్రపు సిరి నరాలమీద పుండు  మనుషుల్ని ఒక చోట నిలబడనివ్వవు. కుమారస్వామి లెక్కప్రకారం ఆయనే లేకపోతె కర్ణాటకకు దిక్కెవ్వరు? అని కూడా అంటారు. అయితే ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే:

హెచ్ డి దెవేగౌడ మనమడు కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ, మాంద్య నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధి సుమలత అంబరీష్ గౌడ పై జేడీఎస్ తరపునపోటీ చేస్తున్నారు.    

కుమారస్వామికి కోపం వచ్చింది అది ఎవరిమీద అంటే సుమలత మీద కాదు కన్నడ స్టార్ హీరో యశ్ మీద. మండ్య లోక్ సభ ఎన్నికలలో యశ్ సుమలతకు మద్దతుగా నిలిచారు. అయితే ఉరుమురిమి మంగళం మీద పడినట్లు,  ఈ పరిణామాల్లో భాగంగా యశ్ మీద ఫైర్ అయ్యారు కుమారస్వామి. యశ్ లాంటి వాళ్లు బతుకీడుస్తున్నారంటే అది తన లాంటి వాళ్ల దయ మాత్రమేనని కుమారస్వామి చెప్పుకొచ్చారు. 

యశ్ మాత్రమే కాదట, సినిమా వాళ్లంతా తన లాంటి వాళ్ల మీద ఆధారపడే బతుకీడుస్తున్నారని కుమారస్వామి చెప్పుకొచ్చారు. అదేలా అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు పూర్వాశ్రమంలో కుమారస్వామి గౌడ సినీ నిర్మాత. కదా! ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారీయన. తనలాంటి నిర్మాతలు సినిమాలు తీయడం వల్ల యశ్ లాంటి హీరోలు బతుకీడుస్తున్నారని కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇది ఒకింత అసంబద్ధమైన వాదన అని చెప్పవచ్చు. కుంపటి కోడి ముసలమ్మ టైపు వ్యవహారమన్న మాట. ఆయన లేకపోతే ఎవరి పొయ్యీ వెలగదు, తెల్లవారదు అనే టైపు.  

సినీ నిర్మాణం పరస్పరాధీనం. ఒకరి మీద మరొకరు ఆధారపడక తప్పదు. ఆ విషయాన్ని గుర్తించకుండా ఆయన అదీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఇలా మాట్లాడటం ఏమిటో? ఇంతకీ యశ్ మీద కుమారస్వామికి ఎందుకంత కోపం వచ్చింది? అంటే, మండ్యలో సుమలతకు మద్దతుగా ప్రచారం చేశాడు యశ్. సుమలత తరఫున నామినేషన్ రోజు నుంచి ఆయన సుమలత వెంటే ఉన్నాడు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నాడు. ప్రచారం చేసి పెట్టాడు.

దీంతో కుమారస్వామికి కోపం నషాళానికి అంటింది. ఈ కెజీఎఫ్ హేరోకి కణ్ణడ నాట అత్యంత క్రేజ్ వచ్చింది. ఇలా సుమలతకు యస్ తో సహా అనేకమంది నటీనటులు మద్దతునిస్తూ ప్రచారం చెయ్యటంతో తన కొడుకు గెలుపు నానాటికీ తీసికట్టు నాగం బొట్లూ అన్నట్లు తయారైంది. నిఖిల్ కు టఫ్ టైం స్టార్ట్ అయింది. అందుకే ఈ రేంజ్ లో మెంటల్ బాలన్స్ తప్పి రెచ్చిపోయాడు కుమారస్వామి. కొన్ని సార్లు కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని యేడ్చే వారు కూడా! 

చివరికి సినిమా హీరోలను నమ్మొద్దని, వారు తెరపై చూపించేదంతా అబద్ధమని కుమారస్వామి చెప్పుకొచ్చారు. అయితే ఆయన రెండవ భార్య రాధిక కూడా కన్నడ నాట సినిమా హీరోయినే అన్నది మరచి పోయినట్లున్నాడు కూడా! 

అయినా ఈయన మాత్రం శాసనసభ ఎన్నికల్లో గెలవటానికి ప్రజలమీద ముఖ్యమంత్రి అవ్వటానికి కాంగ్రెస్ మీద ఆధార పడలేదా? అలాగే నిర్మాతగా యస్ హీరోల మీద ఆధార పడలేదా అంటున్నారు జనం. ఆఖరకు సుమలతను ఎదుర్కోలేక ఏపి నుండి చంద్రబాబు తెచ్చి తన కొడుక్కోసం ప్రచారం చేయించుకోలేదా! సిగ్గుమాలిన మాటలు కాకపోతే! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: