చంద్రబాబు: వృద్ధుల శాపనార్థాలే శాపంగా మారనున్నాయా?

Chakravarthi Kalyan
గతంలో పెన్షన్ తీసుకోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు వృద్ధులు. అయితే వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అవ్వాతాతలకు ఆ కష్టం లేకుండా చేయాలని ఫిక్సయ్యారు. అనుకున్నదే తడవుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారి ద్వారా పెన్షన్ ను ఒకటో తేది ఉదయాన్ని ఇంటి వద్దకు పంపిచేవారు. ఇలా ఎండైనా.. వానైనా.. వరదైనా.. ఒకటో తేది వచ్చిదంటే చాలు ఇంటివద్దకే పింఛన్ వచ్చేది.

సుమారు 58 నెలల పాటు ఇలానే కొనసాగింది. అయితే ఎన్నికలు సమీపించగానే వాలంటీర్లతో పింఛన్, రేషన్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పించ వద్దంటూ కొంతమంది ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో వారి సేవలకు అంతరాయం కలిగింది. అవ్వాతాతలు ప్రశాంతంగా ఇంటి వద్దే కాలు కదపనవసరం లేకుండా పెన్షన్ తీసుకునే విధానానికి స్వస్తి పలికింది. దీంతో ఏప్రిల్ పెన్షన్ కోసం సచివాలయాల చుట్టూ తిరిగి నరకం చూశారు.

క్యూలైన్లో నిలబడలేక పదుల సంఖ్యలో వృద్ధులు మరణించారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇది ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది అనుకునే సమయానికి మళ్లీ మే ఒకటో తారీఖు వచ్చేసింది. మళ్లీ పింఛన్ దారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ సారి సచివాలయాల ద్వారా కాకుండా నేరుగా బ్యాంకుల ఖాతాల్లో నగదు జమ చేశారు. కానీ మంటుడెండలు ఈ సారి ఠారెత్తిస్తున్నాయి. యువకులు, నడి వయస్కులు వారు సైతం ఎండల్లో బయటకి వెళ్లాలంటే నరకం చూస్తున్నారు.

అలాంటిది వృద్ధులు ఈ ఎండల్లో పదుల కి.మీ. ప్రయాణం చేసి బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ ఎండలు తట్టుకొని బ్యాంకులకు వెళ్లడం మన వల్ల అయ్యే పనేనా అని వృద్ధులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకుల క్యూలైన్లో నిల్చోడం, ఫారాలు నింపడం వంటివి మన వల్ల అయ్యే పనేనా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో క్యూలైన్లో నిల్చొన్న వృద్ధులు దీనంతటికీ టీడీపీనే కారణం అని బాధపడుతూ వినరాని తిట్లు తిడుతున్నారు. మరి ఈ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: