మోదీ, రేవంత్‌: ఫేక్ వీడియోలు.. ఫేక్‌ విమర్శలు?.. ఇదేం రాజకీయం?

ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఈ సమయంలో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం హీటెక్కిపోతున్న సమయంలో మరింత హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల నుంచి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో వ్యవహారంలో దిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమందికి సమన్లు జారీ చేశారు. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు ఉంది. వాస్తవానికి ఆయన ముస్లిం రిజర్వేషన్ల రద్దు గురించి మాత్రమే మాట్లాడారు. కానీ దీనిని కొంతమంది మొత్తం రిజర్వేషన్ల రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.

దీంతో కేంద్ర హోం శాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే పీసీసీ అధ్యక్షుడు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కి నోటీసులు జారీ చేశారు. అంతేకానీ ఈ వీడియోని రేవంత్ రెడ్డే దగ్గర ఉండి ఎడిట్ చేయించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫేక్ వీడియోలు గురించి మాట్లాడే ముందు.. ఫేక్ విమర్శల సంగతి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు తీసుకెళ్తారు. మీ వద్ద  ఉన్న బంగారం దోచుకెళ్తారు. మీ మంగళసూత్రాలను సైతం తీసుకెళ్లి ముస్లింలకు కట్టబెడతారు అని పదేపదే విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో దీనికి సంబంధించిన అంశాలు ఎక్కడా లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం.. భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు.  కాంగ్రెస్ అనంది  అన్నట్లు మోదీ దుష్ర్పచారం చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఎందుకు కేసు నమోదు చేయరు అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: