పుష్ప 2 సాంగులో.. షూ వదిలేసే స్టెప్ ఎవరు కంపోస్ చేశారంటే?

praveen
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు ఎన్నో భాషల్లో అద్భుత విజయాన్ని సాధించి అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతలా అలరించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 సినిమా విడుదలైన ఎన్నో రోజులపాటు ఇక ఈ పాటల మాయలోనే మునిగి తేలారు సంగీత ప్రియులు. అయితే ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా విడుదల అయ్యేందుకు  సిద్ధమవుతుంది. ఆగస్టు 15వ తేదీన ఈ మూవీ విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక సాంగ్ ని రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ సాగే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే పుష్ప మొదటి పార్ట్ లో శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ చేసిన కాలి నుంచి చెప్పు జారిపోయే స్టెప్  ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల విడుదలైన పుష్ప పుష్ప సాంగ్ లో కూడా ఇలాంటి ఒక హుక్ స్టెప్ ఉంది.

 ఇటీవల విడుదలైన లిరికల్ సాంగులో అల్లు అర్జున్ షూ వదిలేసి వేసిన స్టెప్ వైరల్ అవుతుంది. ఇక దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో రీల్స్ కూడా పుట్టుకు వస్తున్నాయి అని చెప్పాలి. దీంతో ఈ స్టెప్ కూడా బాగా ఫేమస్ అయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. దీంతో ఇక ఈ మూవీలో ఈ హుక్ స్టెప్ ని ఎవరు కంపోస్ చేశారు అన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు అభిమానులు. కాగా విజయ్ పోలాకి మాస్టర్ కంపోస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ స్టెప్ ను ఆయన కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. నడుస్తూ చెప్పు వదిలేస్తే స్టెప్ ఎంత పాపులర్ అయిందో ఇక ఇప్పుడు షూ వదిలేసే  కూడా అంతే పాపులర్ అయ్యేలాగే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: