ప్రజలకు చెప్పి మరీ ద్రోహం చేస్తా! ఏం పీక్కుంటారో పీక్కోండి! అన్నంత చంద్రబాబు బరితెగింపు

పార్టీకి అనుగుణంగా ఎన్నికల నిర్వహణలో టీడీపీ అదినేత సీఎం నారా చంద్రబాబు నాయుడును మించిన వారు వేరెవరూ లేరన్న వాదన నిజమేనని ఒప్పుకోవాల్సిందే. స్వయంగా చంద్రబాబే తన రాజకీయ మంత్రాంగాన్ని వెల్లడి చేసిన తర్వాత కూడా ఆయన మంత్రాంగంపై ఇక ఏ ఒక్కరికి కూడా అనుమానాలు అనవసరం. తన గెలుపుకోసం ఆయన ఎంతవరకైనా దిగజారతారని ఎలాంటి చర్యలకైనా ఆయన వెనుకాడరని చంద్రబాబుపై ఆయన రాజకీయ శత్రు వర్గాలు చిరకాలంగా చెప్పుకుంటూ వస్తున్న మాటలన్నీ యదార్ధమేనని ఇప్పుడు స్వయంగా చంద్రబాబే ఒప్పేసుకున్నారని చెప్పక తప్పదు. 

నిన్న విశాఖ నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఎన్నిక ల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు ధనాన్నివినియోగించక తప్పదని, అందుకు అందుబాటులో ఉన్న అన్నిసవ్య అపసవ్య మార్గాలను కూడా ఆశ్రయించాల్సిందేనని చెప్పుకున్న చంద్రబాబు, ఈ సారి  ఎన్నికల్లో టీడీపీకి అలా కుదరని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. 


ఇటీవల ప్రత్యేకించి టీడీపీ నేతలపై వరుసగా జరుగుతున్న ఐటీసోదాల్లో వారు దాచుకున్న సొమ్మంతా పోయిందని అయితే ఆ డబ్బుతోనే తాను గెలుస్తానని ఆశించిన ప్రత్యర్థులు తన మనసు లోని అసలు సిసలు మంత్రాంగం తెలుసుకోలేక పోయారని కూడా ఆయన ఎద్దేవా చేసినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే ఆయన మాటల్లోనే: 

"మన వాళ్లు పది రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటే, ఐటీ వాళ్లు వచ్చి ఆ పది రూపాయలను కార్యకర్తలకు ఖర్చు పెట్టనీయ కుండా చూస్తున్నారు. ఏం తమ్ముళ్లూ ఎంత దుర్మార్గం ఇది. ఇది న్యాయమా? నేను ఒకటి ఆలోచించా. శుభ్రంగా నేను ఒక్క పైసా కూడా ఇవ్వను గానీ, నేను ఏమనుకున్నానంటే,  ప్రభుత్వపరంగానే ఈ నెలలోనే పింఛన్లు రెండు వేలిచ్చా. రైతులకు అన్నదాతా! సుఖీభవ! కింద నాలుగు వేలిచ్చా. పసుపు-కుంకుమ కింద నాలుగు వేలిచ్చా. రైతు రుణ మాఫీ కింద ఎనిమిది వేల కోట్లను ఇస్తున్నా" అంటూ చంద్రబాబు తనదైన శైలిలో సంచలన విషయం చెప్పేశారు. 


అంటే, ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు టీడీపీ తరఫున ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుండానే, ఓట్లను రాబట్టుకునేందుకు అంతా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నట్లుగా బాబు చెప్పుకున్నారు. టీడీపీ గెలుపుకోసం ప్రజా ధనాన్నే ఖర్చు చేస్తున్నానంటూ చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం గానే మారిపోయాయి. అంటే,  ప్రజల డబ్బుతోనే ప్రజల ఓట్లను కొనుగోలు చేయడమన్న మాట. ఈ తరహాలో తన కుతంత్రాన్ని తానే స్వయంగా బయటపెట్టుకున్న వైనం చూస్తుంటే, నిజంగానే ఆశ్చర్యం కలగకమానదు. మరి చంద్రబాబు స్వయంగా బయటపెట్టుకున్నఈ కుట్రలపై వైరివర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఎన్నికల సంఘం ఇది గుర్తిస్తుందా? అనేది అనుమానాస్పధం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: