క్రిమినల్ మైండ్-సెట్ తో ఎల్లో మీడియా -వైఎస్ జగన్

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖంలో భయం కనిపిస్తోందని, ఆయనకు మద్దతు ఇస్తున్న మీడియా ముఖంలో దాని ప్రతిబింబం కనిపిస్తోందని వైసిపి అదినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సత్తెనపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు."డ్వాక్రా మహిళలలో చిరునవ్వు కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు" అని, నిజంగా అది నిజమేనని, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడి అసుర పాలన అంతం అయిపోనుందని వారంతా సంతోషపడుతున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబు ఆదేశం మేరకు ఆంద్రజ్యోతి సంపాదకులు వేమూరి రాధాకృష్ణలు కలిసి తప్పుడు సర్వేలు ప్రచురించారని, అయితే 'లోక్ నీతి సీఎస్డీఎస్' అనే సంస్థతో తాము ఎలాంటి సర్వే చేయలేదని ప్రకటించి వేమూరి రాదాకృష్ణ ముఖాన తుపుక్కున ఉమ్మేసిందని ఆయన అన్నారు. ఆంద్రజ్యోతి, ఈనాడులు రోజూ తమ అష్తిత్వం గౌరవం పరువు ప్రతిష్ట మరచి చంద్రబాబు గురించి అనేక కదనాలు రాసి ప్రజలలో ఆదరణ పెంచి ఆయనకు విజయం చేకూర్చటం కోసం ప్రయత్నిస్తున్నాయని జనం నమ్ముతున్నారు. "కాకి పిల్ల కాకికి ముద్దు" అన్నట్లుగా బాబు వీరికి ముద్దు కాబట్టి ప్రజలకు కూడా ముద్దు అనేలా లేనిపోని రాతలు రాస్తున్నాయని ఆయన అన్నారు. 

ఈ ఎల్లో మీడియాకు - జన్మభూమి కమిటీల మాఫియాను సృష్టించిన చంద్రబాబు అంటే మీకు ఎందుకు ప్రేమ అని అడుగుతున్నాను. మొత్తం రైతుల ఋణాలను, డ్వాక్రా మహిళల ఋణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసంచేసిన చంద్రబాబుపై ఎందుకు ఈ ఎల్లో మీడియా ప్రేమ చూపు తోందన అడుగుతున్నాను. ఈనాడు, ఆంద్ర జ్యోతి, టివి 5, టివి 9, ఇంకా అమ్ముడు పోయిన ఎల్లో మీడియా చంద్రబాబుకు అనుకూలంగా రాయడంమే కాకుండా మనపై విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయ ని ఆయన ద్వజమెత్తారు.

టిడిపి గత ఎన్నికల ముందు ప్రకటించిన మానిఫెస్టోని వెబ్-సైట్ లో లేకుండా తొలగించిన టిడిపిపై ఎందుకు అంత ప్రేమ అని ఎల్లో మీడియాను అడుగుతున్నాను. ఇసుకను వదలలేదు. భూములు వదలలేదు, మొత్తం అడ్డగోలుగా దోచేస్తే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు? అని ఆయన ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. జర్నలిజం అంటే చంద్రబాబు ప్రయోజనమా? లేక మీ ప్రయోజనమా? లేక ప్రజల ప్రయోజనమా? అని అడుగుతున్నా అని జగన్ అన్నారు. క్రిమినల్ మైండ్ సెట్ తో ఎల్లో మీడియా కదనాలు రాస్తోందని, వీళ్లు అసలు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: