మంగళగిరిలో చినబాబు డౌటే.. చంద్రబాబు ముందుజాగ్రత్త అందుకేనా.?

Chakravarthi Kalyan
రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరి ఆశయం పదవి.. ఈ పండు అందుకుందామనే అందరూ రాజకీయాలు చేస్తారు. అది తప్పుకూడా కాదు.. ప్రజాసేవకు పదవులు మార్గాలవుతాయి. మరి ఆ పదవులు ఆశించేవారు వేలల్లో ఉంటే..పదవులు మాత్రం వందల్లనే ఉంటాయి. 


అందుకే ఏమాత్రం అవకాశం చిక్కినా ఓ పదవి ఇచ్చి కిందిస్థాయినేతలను ప్రోత్సహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీలో ఎమ్మెల్యేలుగా బరిలో దిగే నాయకులతో చంద్రబాబు రాజీనామాలు చేయించారు. మీరు ఎలాగూ ఎమ్మెల్యేలు అవుతారు.. మరి ఎమ్మెల్సీ ఇంకో నాయకుడికి ఇవ్వొచ్చు కదా అన్నది చంద్రబాబు లాజక్.

దీని ప్రకారమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వంటి నాయకులతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయించారు. వాటిని వేరే అసంతృప్తి నాయకులకు ఇచ్చి బుజ్జగించారు. అయితే ఇంత చాణక్యం చూపిన చంద్రబాబు ఎమ్మెల్సీగానే మంత్రి అయిన తన కొడుకు లోకేశ్ తో మాత్రం రాజీనామా చేయించలేదు.
 
మరి ఎందుకు లోకేశ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు.. మంగళగిరిలో లోకేశ్ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చంద్రబాబు అనుమానిస్తున్నారా.. ఎందుకైనా మంచిదని ఎమ్మెల్సీ పదవిని కూడా ముందుజాగ్రత్త కోసం వదిలిపెట్టలేదా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కావాలనే గట్టి ప్రత్యర్థిని ఎంచుకున్నానంటున్న లోకేశ్ ఎమ్మెల్సీ పదవి ఎందుకు వదలడం లేదో మాత్రం చెప్పడం  లేదు. మరి లోగుట్టు ఆయననే తెలియాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: