ఎడిటోరియల్ : ఓట్లు చీల్చగలదే కానీ ..సీట్లు గెలవగలదా ?

Vijaya

ఇపుడీ విషయంపైనే అందరూ చర్చించుకుంటున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ విషయం నిజమే అనిపిస్తోంది. మొత్తం 175 సీట్లకు గాను పోటీ చేస్తున్నదే సుమారు 75 సీట్లలో.  అంటే మొత్తం సీట్లలో సగం కూడా పోటీ చేయటం లేదు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా తక్కువలో తక్కువ 88 సీట్లలో గెలవటం తప్పనిసరి. కాబట్టి జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే అధికారంలోకి రావటమన్నది జరిగే పనికాదు.

 

ఇక మిత్రపక్షాలైన వామపక్షాలు, బిఎస్పీ విషయానికి వస్తే ఆ పార్టీలు గెలిచే సీట్లపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కాబట్టి జనసేన ఒంటిరిగా కానీ మిత్రపక్షాలతో కలిపి కానీ అధికారంలోకి రావటం కల్లే. ఎందుకేంటే జనసేన గెలవగలిగే సీట్లే సింగిల్ డిజిట్ దాటదని బాగా ప్రచారం జరుగుతోంది.

 

జరుగుతున్న ప్రచారం పై విధంగా ఉంటే తానే కాబోయే ముఖ్యమంత్రని, జనసేన అధికారంలోకి వస్తుందని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చెప్పటమే పెద్ద జోక్. తాను అధికారంలోకి వచ్చేది లేదని కనీసం గౌరప్రదమైన సీట్లు కూడా సాధించే అవకాశం లేదని బహుశా పవన్ కు కూడా తెలిసే ఉంటుంది.

 

మరి జనసేన ఎందుకు పోటీచేస్తోంది ? ఎందుకేంట, మ్యాటర్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టటానికే అన్నది స్పష్టం. జగన్ ను దెబ్బకొట్టటమంటే చంద్రబాబునాయుడుకు సాయం చేయటమే. చంద్రబాబు, పవన్ మధ్య క్విడ్ ప్రో కో నడుస్తోందనే ప్రచారానికి పై విషయాలే మద్దతుగా నిలుస్తున్నాయి.

 

ప్రతీ నియోజకవర్గంలోను ఎంత అవకాశం ఉంటే అన్ని ఓట్లను వైసిపికి పడకుండా ఆపటమే క్విడ్ ప్రో కో ముఖ్య ఉద్దేశ్యంగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఏ పార్టీ అయినా మోజారిటి సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని అనుకుంటుంది. అదేమిటో పవన్ మాత్రం చంద్రబాబును గెలిపించటానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అనుకున్నట్లే ఓట్లు చీల్చగలుగుతుందేమో కానీ సీట్లు గెలవగలదా ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: