ఎడిటోరియల్ : మంగళగిరిలో సిరిసిల్ల చే'నేత’లా ?

Vijaya

అవుననే అంటున్నారు పరిశీలకలు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత. రెండోది అభ్యర్ధి నారా లోకేష్ పై జనాల్లో పెద్దగా ఆధరణ లేకపోవటం. మూడోది వైసిపి క్యాండిడేట్, సిట్టింగ్ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావటం. ఇక చివరిది, కీలకమైనదేమిటంటే, తెలంగాణాలోని సిరిసిల్ల నుండి చేనేత కార్మిక నేతలు మంగళగిరిలో మకాం పెట్టారట.

 

రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో లోకేష్ పోటీ చేయటానికి సేఫ్ నియోజకవర్గమేదో తేల్చుకోవటానికే చంద్రబాబునాయుడు, చినబాబుకు చాలా కాలం పట్టింది. చాలా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించి చివరకు రాజధాని ప్రాంతమైన మంగళగిరిని ఎంచుకున్నారు. ఏ ప్రాతిపదికపై చంద్రబాబు, చినబాబు మంగళగిరిని సేఫ్ నియోజకవర్గంగా ఎంచుకున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం, టిడిపి నేతలు చేసిన చాలా అరాచకాలకు మంగళగిరే కేరాఫ్ అడ్రస్. వేలాది రైతు కుంటుంబాలకు చెందిన దాదాపు 35 వేల ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా లాగేసుకున్నది. తమ పొలాలను ఇవ్వటానికి ఎదురుతిరిగిన వందలాది రైతులను ప్రభుత్వం నానా అవస్తలపాల్జేస్తోంది. బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. దాంతో మెజారిటీ రైతాంగం ప్రభుత్వంపై మండిపోతోంది. భూములు ఇవ్వని రైతుల పంటలను తగలబెట్టించారు.

 

ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల తరపున వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేస్తున్న పోరాటాలు మామూలు పోరాటాలు కాదు. ఒకవైపు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తునే మరోవైపు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పేదలకు రాజన్న క్యాంటిన్ పేరుతో భోజనాలు అందిస్తున్నారు. అలాగే 10 రూపాయలకే ఏడు రకాల కాయగూరలు, ఆకుకూరలు అందిస్తున్నారు.

 

అటువంటి ఆళ్ళపై పోటీ చేస్తున్న లోకేష్ ను ఓడించేందుకు ప్రత్యేకించి చేనేత సంఘాలు కూడా రెడీ అయ్యాయట. ఎందుకంటే ఈ సీటును చేనేతలకే కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు చివరకు పుత్రరత్నానికే కట్టబెట్టారు. దాంతో చేనేతలందరూ మండిపోతున్నారు. అదే పాయింట్ మీద తెలంగాణాలోని సిరిసిల్లకు చెందిన చేనేత నిపుణుల సంఘంలోని కీలక నేతలు కూడా మంగళగిరిలో మకాం వేశారట. సో, గ్రౌండ్ రిపోర్టు చూస్తే రాబోయే రోజుల్లో లోకేష్ కు చుక్కలు కనబడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి ఏమవుతుందో చూడాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: