మహాసేన రాజేష్:పవన్ ను ఓడించకపోతే రాష్ట్రానికే ప్రమాదం.. ఇదేం ట్విస్ట్ గురూ..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలలో రోజుకొక ట్విస్టులు మారుతూ ఉన్నాయి.. ప్రధాన పార్టీలో చేరికలు నడుస్తున్నప్పుడు అటు నచ్చకపోతే ఇటు ఇటు నచ్చకపోతే అటు అన్నట్లుగా పార్టీలు మారుతున్నారు నేతలు. అలా తెలుగుదేశం పార్టీలో చేరిన మహాసేన రాజేష్ ఇటీవల కూటమికి ఒక ఊహించని షాక్ ఇచ్చారు.. సోషల్ మీడియా వేదికగా ఈ ఎన్నికలలో తన  నిర్ణయాన్ని సైతం తెలియజేశారు. అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి తన మద్దతును కూడా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు..

పవన్ కళ్యాణ్ కు గతంలో ఇచ్చినటువంటి మా మద్దతును ఉపసంహరించుకుంటున్నామంటూ తెలియజేశారు.. పవన్ తో పోలిస్తే మా మార్గాలకు జగన్ గారి బెటర్ అని వీరిద్దరి కన్నా చంద్రబాబు మరింత బెటర్ అని కూడా తెలియజేశారు. కుల మతాల పైన అమాయకుల పైన దాడి చేస్తే ఎవరినైనా సరే వ్యతిరేకించమని మా అంబేద్కర్ గారు చెప్పారంటూ వెల్లడించారు.. పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగే అనార్ధాలు ప్రజలకు తెలియజేస్తున్నామని ఇప్పటికే చాలా సహించాము.. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి అన్ని స్థానాలలో కూడా ఓడించడానికి రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నామంటూ వెల్లడించారు మహాసేన రాజేష్.

ముఖ్యంగా మాలాంటి వాళ్లకు పదవులు రాజకీయాలు ముఖ్యం కాదు అన్యాయానికి గురవుతున్న ప్రజల తరఫున పోరాడమే మాకు ముఖ్యము అంటూ తెలిపారు.. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీలో చేరి ఆ పార్టీ గెలుపు కోసం పని చేసిన మహాసేన రాజేష్.. ఫలితాల తర్వాత కొంతకాలానికి జగన్ సర్కారు పైన వ్యతిరేకిస్తూ పలు రకాల యూట్యూబ్ ఛానల్ లో సోషల్ మీడియా అకౌంట్లో ఓపెన్ చేసి మరి వీడియోలను చేశారు. అలా జనసేన పార్టీకి దగ్గర అయిన ఈయన.. ఆ తర్వాత సొంతంగానే ఒక పార్టీ పెట్టాలని ఆలోచన తెచ్చుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వెనుకడుగు వేసి టిడిపి పార్టీలో చేరి సీటు సంపాదించుకొని మళ్లీ ఆ సీటుని వదిలేసుకున్నారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ పైన ఒక సంచలన వీడియో చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి కొంతమంది నేతలు ఇదేమి ట్విస్ట్ గురువు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: