ఓటర్ కి రెండు చేతులు లేకపోతే.. సిరా గుర్తు ఎక్కడ వేస్తారో తెలుసా?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఇక ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక పార్టీలన్నీ ఇక పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎంతో బిజీ బిజీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా అన్ని కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి గెలుపు కోసం పోరాటం చేస్తూ ఉన్నాయ్. ఇక ప్రచారంలో దూసుకుపోతూ ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.

 తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను కూడా ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆయా పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు. ఇలా ఎక్కడ చూసిన ప్రచార హోరు కనిపిస్తూ ఉండగా.. మరోవైపు సోషల్ మీడియాలో ఎన్నికలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. సాదరణంగా ఓటు వేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎడమ చేతి చూపుడు వేలీపై సిరా వేస్తారు అన్న విషయం అందరికి తెలిసిందే.

 ఇలా ఓటు వేసేటప్పుడు వేసే సిరా తుడుచుకున్న కూడా పోదు. దాదాపు నెలరోజుల పాటు అలాగే ఉంటుంది. అయితే ఒకవేళ ఓటు వేసే వ్యక్తికి చూపుడువేలు లేకపోతే లేదంటే మొత్తం  రెండు చేతులు లేకపోతే ఎలా సిరా వేస్తారు అన్న డౌట్ చాలామందిలో వస్తూ ఉంటుంది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే ఒకవేళ ఓటు వేసే వ్యక్తికి ఎడమచేతి చూపుడు వేలు లేకపోతే.. మధ్యలో వేలికి వేస్తారు.. అది లేకపోతే బొటన వేలికి వేస్తారు. ఇక ఎడమ చేయి లేకుంటే కుడి చేతి చూపుడు వేలికి..  అది కూడా లేకపోతే ఉంగరం వేలికి సిరా గుర్తును వేస్తారు. ఒకవేళ ఓటు వేసే వ్యక్తికి రెండు చేతులు లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూయాలని ఎన్నికల సంఘం నిబంధనలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: