రోహిత్ శర్మపై పోల్.. ఆ జట్టుకు ఆడాలంటున్న ఫ్యాన్స్?
ఇక రోహిత్ అభిమానులు అయితే దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను కూడా అన్ ఫాలో చేశారు. అయితే ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం తో వచ్చే ఏడాది ఐపీఎల్ కు ముందు జరగ బోయే మెగా వేలంలో అతను ముంబై నుంచి తప్పుకుని మరో టీం లోకి వెళ్లే అవకాశం ఉంది అని చర్చ జరుగుతుంది దీంతో ఏ టీంలోకి వెళ్తే బాగుంటుంది అనే విషయంపై కూడా ఎంతోమంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ సోషల్ మీడియాలో తమ రివ్యూలు ఇస్తున్నారు అని చెప్పాలి.
అయితే ఇదే విషయం పై సోషల్ మీడియాలో పోల్ నిర్వహించగా ఇక ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆర్సిబి కి ఆడాలని అందరూ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ జట్టును వీడితే.. ఏ టీం తరఫున ఆడాలని మీరు కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ అభిప్రాయాలు తెలియ జేసేలా ఒక పోల్ నిర్వహించింది. ఇందులో ఆర్సీబీ లో కోహ్లీ తో కలిసి ఆడాలని 45% ఓట్లు పోలయ్యాయి. ఇక సిఎస్కే లోకి వెళ్లాలని 39 శాతం మంది కోరుకుంటే.. ముంబై ఇండియన్స్ లోనే కొనసాగాలి అంటూ 16 శాతం మంది కోరుకున్నారు.