
రేవంత్ రెడ్డి: నా బూతు నా ఇష్టం..ప్రచారం చేస్తే జైల్ కేస్తా..!
అయితే ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ లో రేవంత్ రెడ్డి బ్లాస్టింగ్ క్వశ్చన్ అవర్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు.. అయితే ఇందులో యాంకర్ సీఎం రేవంత్ రెడ్డిని ఇలా అడుగుతూ.. తెలంగాణలో ఒక రకమైన భాషనీ ఒకప్పుడు చాలామంది అసహ్యించుకున్నారు.. అలాంటి భాషనే వద్దనుకున్నారు.. ఇదివరకు కాలంలో చూస్తే మీరేమో ఒకరిని చీర కట్టుకొని రమ్మంటున్నారు.. ఆయనేమో మీరు రాహుల్ గాంధీ చీర కట్టుకొని.. వెళ్లాలని చెబుతున్నారు.. ఒకరేమో డ్రాయర్ బనీన్లు లంగాలు గురించి మాట్లాడుతున్నారు.. ఏంటి సార్ ఈ భాష ఏంటి.. ఈ భాష నుంచి విముక్తి ఉందా లేదా తెలంగాణకు అంటే యాంకర్ అడగగా..
ఈ విషయం పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం మీరే చేయాలి.. అసలు ప్రాబ్లమే మీ దగ్గర ఉంది..మిమ్మల్ని ఎవరినైనా ఒకరిద్దరిని జైలుకు పంపితే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు.. ఇలాంటి విషయాలు మాట్లాడంగానే మీరు ప్రచారం చేస్తూ ఉంటారు.. వెయ్యకుండా బ్యాన్ చేయాలి.. ఇలా మాట్లాడే వాళ్ళని చూయించడం ఆపివేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ మీదే ఉంటుంది అంటే ఆ టీవీ ఛానల్ మీద ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.. మీలాంటి న్యూస్ చానల్స్ సామాజిక బాధ్యత 100% ఉండాలి అని తెలిపారు.. జనాలలో మీరు ఇలానే మాట్లాడుతూ ఉంటారు.. మేము వేయాల సార్ అంటు అడగగా..అలాంటివి ప్రసారం చేయవద్దని చెబుతూ ఉన్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటివి చేస్తేనే సమాజానికి బాధ తప్పుతుంది అంటు తెలిపారు.