జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!

Edari Rama Krishna

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి జాబితాను నేడు అధిష్ఠానం ప్రకటించింది. అయితే గుంటూరు జిల్లాలలోని బాపట్ల ఎస్సీ రిజర్వుడ్ లోక్‌సభ స్థానానికి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలేనికి చెందిన నందిగం సురేష్ పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. యస్సీ మాదిగ సామాజిక వర్గంలో పుట్టిన వ్యవసాయ కూలీ కుటుంబ నేపధ్యం. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోతున్న వారు బలమైన ఉద్యమం చేస్తున్న సమయంలో,  రైతులు చేస్తున్న పోరాటంలో గట్టిగా నిలబడినందుకు, నందిగం సురేష్ పై పోలీసులు కక్ష్య గట్టి, ఇతన్ని, ఇతని కుటుంబాన్ని చిత్రహింసల పాలు చేసి, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. 


పంటపొలాలు తగులబడిన కేసులో ఇతని చేత బలవంతంగా జగన్ గారి పేరు చెప్పించి తద్వారా ఆ సంఘటనని జగన్ గారికి ముడిపెట్టాలని సురేష్ ని హింసించి, నోట్లో రివాల్వర్ కూడా పెట్టి బెదిరించిన దారుణాన్ని ఎదుర్కొని, ధైర్యంగా నిలబడిన వ్యక్తి.   ఈ హింసలకు చలించిపోయిన జగన్ గారు నీకు నేను అండగా ఉంటాను అని మాట ఇచ్చారు. ప్రభుత్వం వస్తే ఏదో కార్పోరేషన్ పదవి వస్తుందిలే అని అందరూ భావించారు.  మొదట వైసీపీ యువజన విభాగం నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బాపట్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.


జగన్  మాట ఇస్తే ఇలా ఉంటదా అంటూ సమాజం విస్తుపోయేలా... సురేష్ గారికి బాపట్ల యం పీ సీటు ఇవ్వడమే కాకుండా . . .ప్రక్కనే కూర్చోపెట్టుకుని యం పీ సీట్ల ప్రకటన కూడా సురేష్ గారితో చేయించడం అద్భుతం. మాట ఇవ్వడం, నిలబెట్టుకోవడం ఇంత ఘనంగా ఉంటదా ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: