జగన్ ఓటుకే దిక్కు లేదు .. ఇక మిగతా వారి పరిస్థితి ఏంటి ..!

Prathap Kaluva

ఎన్నికలు వస్తున్న కొద్దీ ఎవరు ఓటు ఉంటుందో .. ఎవరి ఓటు ఉండదో అర్ధం కానీ పరిస్థితి. అయితే ఏకంగా ప్రతి పక్ష నేత అయినా జగన్ ఓటు కూడా తొలిగించే కార్యక్రమం జరిగింది. ఏపీలో ఓట్ల మార్పు చేర్పులకు మరో రెండురోజుల సమయం మాత్రమే ఉన్నట్టుంది. ఇలాంటి నేపథ్యంలో వెలుగు చూసిన మరో సంచలన విషయమే వెలుగులోకి వచ్చింది. అదే పులివెందుల్లో జగన్ ఓటు మాయం కావడం. జగన్ ఓటును తొలగించాలని కోరుతూ పులివెందుల తహశీల్దార్ కు దరఖాస్తు వచ్చింది. ఆన్ లైన్లో జగనే దాన్ని దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.


ఈ విషయంలో తహశీల్దార్ జగన్ కు నోటీసులు ఇచ్చారు. ఓటును ఎందుకు రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారో ఆయన ఇంటికి నోటీసులు పంపించారు. వాటిని చూసి జగన్ ఇంట్లోని వారు ఆశ్చర్యపోయారు. దీనిపై తహశీల్దార్ ను కలిసి వివరణ ఇచ్చారు. అది తప్పుడు దరఖాస్తుగా తేల్చారు. దరఖాస్తు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలిస్ కేసు కూడా పెట్టారు. ఇదీ కథ. ఓట్ల తొలగింపు వ్యవహారం గురించి అర్థం చేసుకోవడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ.


ఏకంగా ప్రతిపక్ష పార్టీ అధినేత ఓటుకే ఎసరు పెట్టేంత తెగింపు! ఓట్ల తొలగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోమ్మని సవాల్ లా ఉంది ఈ వ్యవహారం. జగన్ ఓటుకు ఎసరు పెట్టే ప్రయత్నం జరిగిందంటే.. ఇక సామాన్యుల ఓట్ల తొలగింపు వ్యవహారం ఏ స్థాయిలో ఇక అర్థం చేసుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మీ ఓట్లు ఉన్నాయా లేదా.. అని చెక్ చేసుకోవడానికి ఉన్న సమయం తక్కువ. కాబట్టి.. ఈలోపే జాగ్రత్త పడితే మీ ఓటు హక్కును మీరే కాపాడుకున్న వాళ్లవుతారు. లేకపోతే.. తీరా పోలింగ్ రోజున ఎంత అరిచి గీపెట్టినా ప్రయోజనం ఉండదు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: