మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇక టిడిపి మురుగు లోనేనా! ఇతను కూడ ఇంతే!

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదుచూసి మోసపోతూ ఉంటాం!  అవినీతి, బందుప్రీతి, కులచీడపట్టి నేఱగాళ్ళ అడ్డాలుగా మరిన రాష్ట్ర రాజకీయపార్టీలకు భిన్నంగా అటు పవన్ కళ్యాన్ ఇటు మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వివి ళక్ష్మి నారాయణ కొత్త పంధా రాజకీయ పార్టీలను నిర్మిస్తారని ఆశించిన వారికి “వీరు కూడ ఇంతే" అన్నట్లు తయారయ్యారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణాధికారిగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందన్న వాదన వినిపిస్తోంది. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణ, సీబీఐలో పనిచేసిన సందర్భంగా ఏపీ జేడీగా వ్యవహరించారు. 

ఆ సమయం లోనే వైఎస్ జగన్మోహనరెడ్డిపై కాంగ్రెస్ - టీడీపీలు కలసి కుట్రతో సీబీఐ విచారణ జరిగేలా వ్యవహరించాయన్న వాదన నాడు వినిపించింది. టీడీపీలో అత్యంత సన్నిహితంగానే మెలగిన లక్ష్మీనారాయణ, నాటి కేసు వివరాలను టీడీపీ అనుకూల మీడియాకు  లీక్ చేసి "పెద్ద లీకేశ్వరుడై" కుట్రకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. 

అయితే ఆ తర్వాత ఆయన బదిలీ కావడం ఆ తరవాత అ ప్రధాన పోష్ట్ లో కొంతకాలం గడిపి ఆ తరవాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయలను ప్రక్షాళణచేసే ఉద్దేశంతో వచ్చేస్తున్నానంటూ ప్రకటించడం జరిగిపోయింది. ఈక్రమంలో లక్ష్మీనారాయణ టీడీపీలోనే చేరతారని నాడు ప్రచారంసాగినా, ఆయన దానిని ఖండించారు. సొంతంగానే పార్టీ పెట్టుకుంటానని, ఇతర పార్టీల్లో చేరేది లేదని కూడా తేల్చేశారు.

అయితే ఇప్పుడు ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో మరో మారు లక్ష్మీనారాయణపై ఈ తరహా పుకార్లే మళ్ళీ ఇప్పుడు షికారు చేస్తున్నాయి. లక్ష్మీనారాయణ నేడో - రేపో టీడీపీలో చేరిపోతున్నారని ఆయనకు విశాఖజిల్లాలోని భీమిలి శాసనసభ  నియోజకవర్గాన్ని కేటాయించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపారని కూడా నేటి ఉదయం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. 

ప్రచారమంతా కూడా టీడీపీ అనుకూల మీడియాలోనే కొనసాగింది. దీనిపై అప్పటి కప్పుడు రంగంలోకి దిగిపోయిన కాంగ్రెస్, వైసీపీలు లక్ష్మీనారాయణ ముసుగు తొలగి పోయిందని టీడీపీలో చేరుతున్న ఆయన వైఖరిచూస్తుంటే, నాడు జగన్మోహనరెడ్డి కేసులపై ఏ తీరున విచారణ నిర్వహించిందన్న విషయం కూడా తేలిపోయిందని విమర్శలు ఎక్కుపెట్టాయి.



దీంతో సాయంత్రానికల్లా బయటకు వచ్చేసిన లక్ష్మీనారాయణ తాను టీడీపీలో చేరడంలేదని ప్రకటించేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కూడా ఆయన తేల్చేశారు. అంతేకాకుండా రాజకీయాలకు సంబంధించి తాను ఇంకా ఒక  స్పష్టమైన నిర్ణయాన్నే తీసుకోలేదని, టీడీపీ అనుకూల మీడియాలో సాగుతున్నదంతా ఒట్టి పుకార్లే నని కూడా తేల్చి పారేశారు.  మొత్తంగా విపక్షాలన్నీ ఒక్కుమ్ముడిగా విరుచుకుపడటంతో నేరుగా లక్ష్మీనారాయణే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: