"విజయ్ 69" పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్..!

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో అనే స్టైలిష్ యాక్షన్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 68 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే విజయ్ తాను మరికొన్ని రోజుల్లోనే రాజకీయాలకు వెళ్ళనున్నట్టు అంతలోపు గోట్ మూవీ తర్వాత డి వి వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నట్లు ఆ సినిమా తర్వాత మూవీ లు చేయను అని ప్రకటించాడు. దానితో డి వి వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ హీరోగా నటించబోయే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే తాజాగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ 69 వ సినిమా చేసే అవకాశం నాకు గనుక వచ్చినట్లు అయితే అందులో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ,  బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్. అలాగే మళయాళం నుంచి మమ్ముట్టి లని విజయ్ తో ఆ సినిమాలో చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇలా ఈయన చెప్పడంతో ఈ కాంబో కనుక సెట్ అయినట్లయితే ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: