పిచ్చుకలు కూడా సింహాలను చాలంజ్ చేస్తున్నాయి?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి ప్రధాని నరేంద్ర మోదీ పై నోరుంది కదా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం శంషాబాద్‌ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో విజయశాంతి మాట్లాడారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ టెర్రరిస్టు లా ప్రజలను భయపెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల ను రక్షించాల్సింది పోయి భయపెడుతున్నారని ఆరోపించారు. రానున్న లోకసభ ఎన్నికలు కాంగ్రెస్‌-బీజేపీకి మధ్య జరిగే సమరం అంటూ విజయశాంతి అభివర్ణించారు.

ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్‌ గాంధీ పోరాడుతున్నారని, అయితే నరేంద్ర మోదీ దాన్ని ఖూనీ చేసి, నియంతలా పాలించి, మరోసారి గద్దెనెక్కాలనుకుంటున్నారని అన్నారు. నరేంద్ర మోదీ చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తోందని, నరేంద్ర మోదీ ఎప్పుడు ఏం బాంబు వేస్తారో అని దేశ ప్రజలు వణికిపోతున్నారన్నారు. పెద్దనోట్ల రద్దు మొదలు, జీఎస్టీ, పుల్వామా ఉగ్రదాడి వరకూ ఇదే పరిస్థితి అన్నారు. ఇప్పటి కైనా ప్రజలు ఆలోచించి నరేంద్ర మోదీని గద్దె దింపాలని విజయశాంతి పిలుపు నిచ్చారు. కాగా ఇదే సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై విమర్శల వర్షం కురిపించారు. మోదీ, కేసీఆర్‌ కుమ్మకైయ్యారని విజయశాంతి ఆరోపించారు.

అదేసభలో జనమేమంటున్నారో తెలుసా, విజయశాంతి ఇప్పుడు ఏ పార్టీలో ఉంది? అని ప్రశ్నిస్తున్నారు. 1998 లో బిజెపి మహిళామోర్చాకు కార్యదర్శిగా రంగ ప్రవేశం చేశారు. ఆపై ఏఐ-ఏడిఎంకె కు కూడా స్టార్ కాంపెయినర్ గా పనిచెశారు, సమాంతరంగా బిజెపికి కూడా. 2009 లో తల్లి తెలంగాణా అంటూ ఒక పార్టీ పెట్టారు. తరవాత దాన్ని నడపలేక టిఆరెస్ లో నిమజ్జనం చేసేశారు. టిఆరెస్ పతాకం కింద ఎంపిగా మెదక్ లో గెలిచారు. ఆపై కేసీఆర్ తో విభేధాలొచ్చి 2014 లో టిఆరెస్ కు రాజీనామా చేసి కాంగ్రేస్ లో చేరిపోయారు.

ఆమె 2014 లో కాంగ్రేస్ తరపున మెదక్ ఎమెల్యేగా ధారుణ పరాజయం పాలైనారు. ప్రజాసేవ ఏం చేశారో? రాజకీయాల్లో ఏం సాధించారో? అమె కూడా చెప్పలేరు. సినీ పరిశ్రమలో సాధించిన పేరుప్రతిష్టలు మొత్తం రాజకీయాల్లో పోగొట్టుకున్నారు. ఇప్పుడామె రాజకీయ చరిత్ర హీన, ప్రధాని మోడిని తిడుతున్నారు. అసలామె స్థాయి అందుకు సరిపోయేనా?  


జనం అవాక్క‌య్యేలా! రిటన్ గిఫ్ట్ అంటూ కేసీఆర్ పై ఒక పిపీలికం లోకేష్ కౌంట‌ర్‌


“రిట‌ర్న్ గిఫ్ట్‌” ప‌దం గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీల మ‌ధ్య సాగుతున్న రాజకీయ ఎత్తుగ‌డ‌ల్లో ఈ ప‌దం తెర‌మీద‌ కు వ‌చ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణా శాసనసభ ఎన్నిక‌ల అనంత‌రం త‌మ‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసిన తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. దీనికి త‌గిన‌ట్లుగానే ఆయ‌న ప‌లు అడుగులు వేశారు. అయితే, తాజా ప‌రిణామానికి రిట‌ర్న్ గిఫ్ట్‌కు లింక్ పెట్టి ఏపీ మంత్రి, టీడీపీ యువ‌నేత లోకేష్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. 


“సున్నిత‌మైన ప్రజా సమాచారం దారిత‌ప్పుతోంది” అంటూ వైసీపీ చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గత శనివారం అర్ధరాత్రి మొదలైన ఈ వివాదం గత ఆదివారం రాత్రికి కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండో రోజు ఆదివారం కూడా తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్‌ సంస్థ ఉద్యోగుల నివాసా లలో సోదాలు నిర్వహించారు. 

పోలీసుల అదుపులో వున్న సంస్థ ఉద్యోగుల ఆచూకీ తెలియ చెప్పడం లేదని, వారిని న్యాయమూర్తి నివాసం లోనే విచారించాలని సంస్థ సీఈఓ అశోక్‌ హైకోర్టులో హెబియస్‌-కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఈ కేసు ఉభయ తెలుగు రాష్ట్రప్రభుత్వాల మధ్య సంచలనంగా మారింది.  పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తు లు, పోలీసుల అదుపులో వున్నవారిని సోమవారం ఉదయం 10.30 గంటలలోగా హైకోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ఉత్కంఠ తొలగేందుకు అవకాశం ఏర్పడింది.


ఈ ఎపిసోడ్‌ పై ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. ట్విట్ట‌ర్‌లో ఆయ‌న త‌న మార్క్ రిప్లై ఇచ్చారు. ''టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా! అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి (వైఎస్ జగన్) తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ, డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ ని టీఆర్ఎస్ దెబ్బ తీసింది'' అని మండిపడ్డారు. 


''హై కోర్ట్ సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాలపై వీఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఐటీ కంపెనీ లపై దాడిచేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది'' అంటూ మ‌రో ట్వీట్లో ఎద్దేవా చేశారు. ఇక్కడ లోకెష్ అనే వ్యక్తికి చరిత్ర లేదు. ఓకసారి కూడా ప్రజా క్షెత్రంలో గెలిచి మంత్రి కాలేదు. ఏదో తండ్రి రాజకీయంతో దొడ్డిదారిన ఎమెల్సీ ఆపై మంత్రి అయ్యారు. అయ్య లేకపోతే ఈ అయ్య వారికి నెలకు ₹10000/- జీతం కూడా వచ్చే ఉద్యోగం దొరకదని వైసిపి నాయకుడు విజయసాయి రెడ్డి వాకృచ్చారు. 

అలాంటి పిల్లకాకి రాజకీయ చండ ప్రచండు కేసీఆర్ పై వ్యాఖ్యలు చేయటం మన ఖర్మ కాబట్టి వింటున్నాం అంటున్నారు జనం. శివుని మెడలో ఉన్నంత వరకే నీ ప్రతాపం అని నాగరాజును అన్నాడట గరుత్మంతుడు. ఇలాంటి "పిపీలికం" చంద్రబాబు కొడుకు కాబట్టి బ్రతికి పోయాడు అంటున్నారు తెలంగాణా జనం. కాల మహిమ కాకుంటే  ఆఖరకు లోకేష్ కూడా అవ్వ!  కలవకుంట్ల చంద్రశేఖరుణ్ణి నిందించుటయా!  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: