జగన్‌కు సొంత బాబాయ్ జలక్ ఇస్తారా..? ఏం జరుగుతోంది..?

Chakravarthi Kalyan

ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు ఇంటి పోరు తప్పడం లేదా.. ఆయనకు సొంత బాబాయ్ నుంచి నిరసన ఎదురువుతోందా.. జగన్ పై అలిగినందువల్లే సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్జి జగన్ మంగళగిరి గృహ ప్రవేశానికి హాజరు కాలేదా.. ఇప్పుడు మీడియాలో ఈ విషయాలపై చర్చ జరుగుతోంది.



ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి మళ్లీ జగన్ టిక్కెట్ ఇచ్చే విషయంపై అంత సానుకూలంగా లేరని.. అందుకే సుబ్బారెడ్డి అలిగారని అంటున్నారు. పారిశ్రామికవేత్త మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని.. ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. మాగుంట రాకను వ్యతిరేకిస్తున్న సుబ్బారెడ్డి తానే ఒంగోలు బరిలో దిగుతానని స్పష్టం చేశారు.



అయితే ఈ విషయంలో వైవీ సుబ్బారెడ్డి అలక తీరినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే సుబ్బారెడ్డి పార్టీ అదినేత జగన్ తో కలిసి డిల్లీ వెళ్లారు. సుబ్బారెడ్డి నిజంగానే అలిగారో, లేక వేరే కారణం వల్ల గృహప్రవేశానికి వెళ్లలేదో తెలియదు కాని ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చారు. జగన్ కు స్వయంగా బాబాయి అయ్యే ఆయన రాకపోతే వార్తగానే చూడాల్సి ఉంటుంది.



పార్టీ టికెట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న జగన్... ఈ విషయంలో అసలు మొహమాటాలకు పోవడం లేదని సమాచారం వస్తోంది. అందుకే ఒంగోలు విషయంలో తన బంధువుల వద్ద కూడా ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నట్టున్నారు. మరి సుబ్బారెడ్డిని ఎలా కన్విన్స్ చేస్తారో.. లేక మళ్లీ ఆయనకే సీటిస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: