సైన్యానికి సెలవుల రద్ధు-సరిహద్ధుల సంరక్షణ-ఉగ్రవాదుల పనిపట్టటమే లక్ష్యంగా సైన్యం సిద్ధం

సైన్యం సేవలు అత్యవసర అవసరాల క్రిందకు వస్తాయి. యుద్ధ సమయాల్లో ఏ పరిస్థితిలోనైనా ప్ర్తి ఒక్క సైనికుదు విభిన్న విభాగాల్లో పనులు బాధ్యతలు నిర్వహించ వలసిన అవసరం ఉంటుంది. వివిధ క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోను కూడా వారి సేవలు అవసరం పడుతుంది. అందుకే వారికి సెలవుల విషయంలో దేశ అవసరాలే ప్రాధాన్యత సంతరించుకుంటాయి.    

ఇప్పుడున్న పరిస్థితుల్లో - ప్రభుత్వ నిర్ణయం మేరకు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు తమ సైనికోద్యోగులకు సర్క్యూలర్లు జారీ చేశాయి. సెలవుల్లో ఉన్నవారు వెంటనే తిరిగివచ్చి విధుల్లో చేరి బాధ్యతల్లో పాల్గొనాలని ఆదేశించింది. భారత్ - పాకిస్థాన్ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించింది. నేడు భారత్ సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా నిర్వహించింది. 

సరిహద్దుల వెంబడి నిఘా కోసం పాకిస్థాన్ సైన్యం "డ్రోన్" లను ఉపయోగించింది. ఉదయం 6.30 గంటల సమయంలో పాక్ డ్రోన్ ఒకదానిని భారత సైన్యం పేల్చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాదు పాకిస్థాన్ భూభాగం లోని ఈశాన్య రాష్ట్రం కైబర్ ఫంక్త్యూ లోను దాడులు చేపట్టింది. 


మొత్తం 12 మిరేజ్-2000 జెట్ ఫైటర్లతో భారత వైమానిక దళం ఆపరేషన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మూడు ప్రాంతాలలో అంటే బాలాకోట్, చాకోటి, ముజాఫరాబాద్ లాంటి ఉగ్రవాదుల ఆలవాల మైన ప్రదేశాల్లో ఒక్క సారిగా చేపట్టి విరుచుకుపడింది. జైషే అధినేత అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదిగా గుర్తించిన మ‌సూద్ అజ‌ర్‌ కు బావ‌మ‌రిది అయిన యూసుఫ్ అజ‌ర్ అక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం అందగా భారత వాయు సేన మంగళవారం (ఫిబ్రవరి 26) నిర్వహించింది. ఆ దాడి లో యూసుఫ్ అజ‌ర్ హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. దీన్ని అధికారులు ధ్రువీకరించవలసి ఉంది.

దాదాపు జైష్-ఎ-మహమ్మద్, లష్కర్-ఏ-తొయిబా, హిజ్బుల్ ముజాహదీన్ లాంటి ప్రధాన ఉగ్రవాద గ్రూపుల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంప్ లు, ఎయిర్ బేస్ ల వద్ద అప్రమత్తం చేశారు. దాడుల నేపథ్యంలో గుజరాత్ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ తెల్లవారు జామున భారత్ వైమానిక దాడులు నిర్వహించింది. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది.


జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా 12 మిరేజ్-2000 ఫైటర్ జెట్ లతో దాడులు చేశారు. మొత్తం 21 నిమిషాలలో ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారు 1000 కిలోల ఎక్స్-ప్లోసివ్ మెటీరియల్స్ తో తయారైన  బాంబులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో సుమారు 300 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్ తేరుకునే లోపు పని ముగించేసింది. 

బాలాకోట్లో తెల్లవారు జామున 3.45గంటలకు దాడులు ప్రారంభించింది. తరువాత చకోటి, ముజఫరాబాద్ లో వరుసగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో జేషే మహ్మద్ ఉగ్ర శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్ ఆర్మీ అంతా తెలుసుకునే లోపు పని పూర్తి చేసింది. పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చినా ఎదుర్కొనేందు కు భారత వైమానికళం సర్వ సన్నద్ధంగా ప‌హారా కాస్తోంది.

Pakistani drone shot down on Kutch data-border in Gujarat

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: