జగన్ వ్యూహం మైండ్ బ్లోయింగ్ - ఆ పత్రికాధినేత పెన్నుకు నోటికి రెంటికీ తాళం వేసినట్లేనా?

టిడిపిలో అత్యంత కీలక నేత విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేతగా ప్రఖ్యాతి గాంచిన వ్యాపార పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ ఎవరూ ఊహించని విధంగా వైసీపీలో చేరారు. వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా ఆయనని సాదర స్వాగతం పలికి వైసిపి కండువా కప్పారు. తొలి నుంచీ మంచి వ్యాపారవేత్తగా పేరుప్రతిష్ఠలున్న దాసరి జై రమేష్, ఒక్కసారిగా తెలుగు దేశం పార్టీ నుండి బయటకొచ్చినంత మాత్రానా వైసీపీకి కలిగే ప్రయోజనం ఏముంటుందనే ప్రధాన ప్రశ్న.


సీనియర్ రాజకీయవేత్త దాసరి జై రమేష్ వైసిపి ప్రవేశం విజయవాడ పార్లమెంటరీ నియోజక వర్గంలో రాజాకీయాల్లో అత్యంత తీవ్రత పెంచింది. అయితే ఈ ప్రవేశం అంతా అంత సునాయాసం గా జరగలేదు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అడుసుమిల్లి జయప్రకాష్ లాంటి ప్రముఖుల వ్యూహాత్మక సహకారంతో వైఎస్ జగన్ ఈ అద్భుత కార్యం సాధించారని చెప్పవచ్చు.


దీనికి నేపధ్యం చంద్రబాబు జై రమెష్ కు విజయవాడ పార్లమెంట్ స్థానం ఒకసారి, మరోసారి గన్నవరం శాసనసభ స్థానం టిక్కెట్ ఇస్తానని వాగ్ధానం చేసి రెండుసార్లు టిక్కెట్లు ఇవ్వకుండా మోసం చేశారని జై రమేష్ చెప్పారు. అంతే కాదు గత టిడిపి ఐదేళ్ళ పాలనా కాలంలో అవినీతి తారస్థాయికి చేరిందని ప్రతి అధికార పార్టీ ప్రతినిధి గుత్తెదార్ల పనుల నుండి 20 శాతం నుండి 30 శాతం వరకు కమీషన్లు దండుకునేవారని అన్నారు. తద్వారా గత ఐదేళ్లకాలంలో ప్రతి టిడిపి శాసనసభ్యుడు ₹50 నుండి ₹100 కోట్లు సంపాదించారని ఈ సందర్భంగా జైరమేష్ అన్నారు. 


గతంలో అంటే 1998లో కాంగ్రెస్ కు చెందిన పర్వతనేని ఉపేంద్ర చేతిలో విజయవాడ నియోజకవర్గంలో ఓటమి చవి చూశారు దాసరి జై రమేష్ అలాగే ఆయన సోదరుడు బలవర్ధనరావు 1999 మరియు 2009 మద్య మూడు సార్లు శాసనసభ్యుడుగా గెలిచారు. కాని 2014లో చంద్రబాబుతో రాజకీయ వ్యక్తిగత విభేదాల వలన దాసరి సోదరులకు టిడిపి టిక్కెట్ రాకుండా చేశారు బాబు. 


కాని జై రమేష్ ని వైసీపీలో చేర్చుకోవడం ద్వారా వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యూహాత్మకంగా ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణకు "చెక్" పెట్టినట్లే అంటున్నారు జనం. వైసిపికి విజయవాడ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయటానికి సరైన కమ్మ కులానికి చెందిన అభ్యర్ధి ఇంతవరకు దొరకలేదు. గతంలో కేసినేని నాని చేతిలో ఓడిపోయిన కొనేరు రాజెంద్ర ప్రసాద్ ఎందుకో ఈసారి అంత ఉత్సాహంగా లేరు. అందుకే జై రమేష్ ను ఎంపిక చేసిన జగన్ తన వ్యూహాన్ని తనవాళ్ల ద్వారా సాధించారు. 


వేమూరి రాధాకృష్ణకు, ఆంధ్రజ్యోతి దినపత్రికతో పాటు, ఏబీఎన్-వార్తా చానెల్ కూడా ఉంది. పేపర్-చానెల్ రెండూ కూడా ఏపి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు నూటికి నూరుపాళ్ళు అనుకూలం. వైసీపీకి అత్యంత తీవ్ర వ్యతిరేఖి. వైసిపి ప్రక్కనుంచి అతి చిన్నఅవకాశం దొరకాలే కానీ ఆ తూర్పార బట్టటంలో ధిట్టగా నిలిచింది ఆ మీడియా. చంద్రబాబు నాయుడికి బాకా ఊది, బాజా వాయించటానికి లేశమాత్రం కూడా సంకోచించదు ఏబిఎన్ గ్రూప్. 


అసలు తాను జన్మించిందే చంద్ర బాబు నాయుడు పాదాల చెంత జీవించటం కోసం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. అవశేషాంధ్రలో టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రత్యక్షం గా పరోక్షంగా వేమూరికి సిద్ధించిన ప్రయోజనాలు సఖల అంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిన విషయమే. అంతేకాదు అమరావతి లో ప్రచారంలో ఉన్న వార్తేమంటే సచివాలయంలో కార్యదర్శుల, సచివుల చేత పనులు చేయించటంలో ప్రధాన పాత్ర ఒకటి రెండు పత్రికల యాజమాన్యాలకు అనుకూలురైన పాత్రికేయుల సలహాల మీదే పనులు జరుగుతాయని అంటారు.


ఇక ఇప్పుడు రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడ్ని తన పేపర్, చానెల్ తో దగ్గరుండి గెలిపించాలనేది రాధాకృష్ణ అభిమతమట. అయితే, ఏబీఎన్ గ్రూప్ లో ప్రదాన ప్రమోటర్ జై రమేష్ దాదాపు ఏబీఎన్ గ్రూపు లో 25 శాతం షేర్ ఉంది. ఇక ఈ పరిస్థితుల్లో జగన్మోహనరెడ్డిని అంతలా విమర్శించ ఆ మీడియా. అలాగని అంత తెలిగ్గా చంద్రబాబు నాయుణ్ణి ములకచెట్టునూ ఎక్కించలేడు. అసలే ముంగిట్లో ఎన్నికల వేళా, తన పార్టీపై తనపై వ్యతిరేఖ వార్తల్ని ప్రచారం చేసే ఆంధ్రజ్యోతి గ్రూప్ ని నియంత్రణ లోకి తెచ్చారు వ్యూహాత్మకంగా జై రమేష్ ను తన పార్టీలోకి తెచ్చుకొని సాధించారు జగన్మోహనరెడ్డి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: