చంద్రబాబు దుబారా ఖర్చులకు అంతేలేదు..రూ 30 కోట్లా ?

Vijaya

చంద్రబాబునాయుడు చేస్తున్న దుబారా ఖర్చులకు అంతే ఉండటం లేదు. ఒకవైపు రాష్ట్రప్రభుత్వం ఆర్దిక ఇబ్బందుల్లో ఉందని చెబుతునే మరోవైపు వ్యక్తిగత ప్రయోజనాలనే రాష్ట్రావసరాలుగా చిత్రీకరించి కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిజానికి గడచిన నాలుగున్నరేళ్ళల్లో చంద్రబాబు వ్యక్తిగత ప్రచారానికి ఖర్చుచేసిన ప్రభుత్వ సొమ్ము సుమారుగా రూ 40 కోట్లుంటుందని అంచనా. అటువంటి దండగమారి ఖర్చుకే మళ్ళీ చంద్రబాబు సిద్ధమయ్యారు

 

కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లీలో ఈనెల 11వ తేదీన దీక్ష చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు చేయబోయే దీక్షకు ఆవగింజంత ఉపయోగం కూడా ఉండదన్నది వాస్తవం. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ? అందుకనే రాష్ట్రప్రయోజనాలని తోటకూరకట్టని నానా హంగామా చేస్తున్నారు. అందులో భాగంగానే ధర్మపోరాట దీక్షలు చేశారు గుర్తుంది కదా ? ఆ డ్రామాలోనే ఢిల్లీ దీక్ష క్లైమ్యాక్స్ లాంటిది. అందుకనే రాష్ట్రం నుండి టిడిపి ప్రజా ప్రతినిధులు, నేతలు, జనాలను ఢిల్లీకి తరలిస్తున్నారు.

 

పనిలోపనిగా జాతీయ స్ధాయి నేతలను కూడా ఆహ్వానించారనుకోండి అది వేరే సంగతి. కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం చేస్తున్న దీక్షట. అందుకనే శ్రీకాకుళం, అనంతపురం తదితర జిల్లాల నుండి ప్రత్యేక రైళ్ళు వేస్తున్నారు. సరే మంత్రులు, ఎంపిలు ఎలాగూ విమానాల్లోనే కదా వెళ్లేది. అంటే ఏ విధంగా వెళ్ళినా వాళ్ల ప్రయాణ, బస ఖర్చులంతా ప్రభుత్వమే భరిస్తుందన్న మాట. అంటే సుమారుగా మరో రూ 3 కోట్లకు టెండర్ పెట్టారు. నవనిర్మాణ దీక్షలన్నారు, ధర్మపోరాట దీక్షలన్నారు. రాష్ట్రానికేమైనా ఒరిగిందా ? 11వ తేదీ దీక్షతో కూడా జరగబోయేది అదే. ఏమైనా చంద్రబాబు అనుకుంటే దుబారా అయినా సరే ఆర్భాటంగా జరగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: