ప్రమాదకర జబ్బు నుండి రాహుల్ గాంధి త్వరగా కోలుకోవాలని ఆశిద్ధాం!

శారదా చిట్ ఫండ్ కుంభకోణం ఈ నాటిది కాదు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని శారద చిట్ ఫండ్ కుంభకోణంలో ఎఐసిసి అదినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బిజెపి గుర్తు చేసింది. రాహుల్ గాంధిలో ఏదో మానసిక లోపమో! సంక్షోభమో! లేక బహుళ సమస్యల రుగ్మత (మల్టిపుల్ డిజార్డర్) తో బాదపడుతున్నట్లుగా ఉందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది.

అయితే ఈ ప్రమాదకర రుగ్మతల నుండి రాహుల్ గాంధి త్వరగా కోలుకోవాలని కూడా బిజెపి ఆకాంక్షించింది. మమత బెనర్జీకి రాహుల్ గాంధి తాజాగా మద్దతు ప్రకటించిన నేపద్యంలో బిజెపి ఈ వ్యాఖ్యలు చేసింది.గతం లో రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలను కూడా పోస్టు చేసింది.

శారదా కుంభకోణం దేశం లోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి. పశ్చిమ బెంగాల్‌ లో సిండికేట్‌ రాజ్‌, మాఫియా రాజ్‌ నడుస్తుందని రాహుల్ గాంధి అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కేసు లో సిబిఐ విచారణ చేస్తుంటే మమత బెనర్జీ అడ్డుకుంటున్నారు.అందుకు రాహుల్ గాంధి సర్వం మరచి నాలుక మడతేసి మద్దతు ఇవ్వడం విశేషం.


ఆ ట్వీట్స్ సారాంశం ఇలా ఉంటుంది 


2016లో పలు ప్రచార కార్యక్రమాల్లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్లను భాజపా పోస్టు చేసింది. అందు లో ‘శారద చిట్‌ఫండ్‌ కుంభకోణం కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు తమ నగదును పోగొట్టు కున్నారు. అవినీతిని రూపుమాపుతానని మమతా జీ అన్నారు. కానీ దానికి బదులుగా ఆమె బెంగాల్‌ను దోచు కుంటున్న వారిని కాపాడుతున్నారు. శారదా కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి. పశ్చిమ బెంగాల్‌ లో సిండికేట్‌ రాజ్‌, మాఫియా రాజ్‌ నడుస్తుంది’ అంటూ రాహుల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ల ఫొటోను భాజపా పోస్టు చేసింది. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్‌ మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నా రంటూ వ్యంగాస్త్రాలు సంధించింది. ఇటువంటి వ్యాధితో బాధపడే వాళ్లు గతంలో జరిగిన విషయాలను గుర్తు చేసు కోవడంలో ఇబ్బంది పడతారు. వాటిని మరిచిపోతారు. రాహుల్‌ జీ!.. త్వరగా కోలుకోండి’ అంటూ భాజపా ట్వీట్‌ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: