ఎడిటోరియల్ : ఫిబ్రవరి టిడిపికి చాలా కీలకమట

Vijaya

ఫిబ్రవరి నెల తెలుగుదేశంపార్టీకి చాలా కీలకమని ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది పార్టీలో. ఫిబ్రవరి నెలంటే సరిగ్గా ఎన్నికలకు సుమారుగా రెండు నెలల ముందన్నమాట. ఇంతకాలం ప్రతిపక్షం వైసిపిని వీక్ చేసేందుకు చంద్రబాబునాయుడు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ లాంటిదే రివర్స్ అవబోతోందట. ఇప్పటికే టిడిపికి చెందిన ఇద్దరు ఎంఎల్ఏలు బయటకు వచ్చేశారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు దాదాపు రెండు నెలల క్రితమే పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు రోజుల క్రితమే కడప జిల్లాలోని రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లి కార్జునరెడ్డి కూడా టిడిపికి, ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసేశారు.

  

అయితే, రానున్న ఫిబ్రవరిలో మరింత మంది ఎంఎల్ఏలతో పాటు పలువురు కీలక నేతలు పార్టీని వదిలేయనున్నట్లు సమాచారం. వారంతా వైసిపిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారట.  ఆ విషయం తెలిసిన దగ్గర నుండి చంద్రబాబులో టెన్షన్ ఓ రేంజిలో పెరిగిపోతోందట. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా నిర్వహించిన ప్రతీ సర్వేలోను వైసిపిదే ఘన విజయమని ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే తాము టిడిపిలో ఉంటే లాభం లేదనే అభిప్రాయానికి పలువురు ఎంఎల్ఏలు వస్తున్నారట. అందుకనే అవకాశం ఉన్న వారంతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డతో టచ్ లోకి వెళుతున్నారని సమాచారం.

 

ఒకవైపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్ధుల కోసం జగన్ కసరత్తు స్పీడవుతోంది. పాదయాత్రలో భాగంగా ఇప్పటికే సుమారు 20 మంది అభ్యర్ధులను ప్రకటించారు. మరో పదిమంది అభ్యర్ధులను మిథున్ రెడ్డి లాంటి జిల్లాల ఇన్చార్జిలు ప్రకటించారు. దాంతో టిడిపిలో ఉంటే కష్టమని భావించిన ఎంఎల్ఏలు, నేతలు వైసిపిలో చేరేందుకు తొందరపడుతున్నారట. ఇదే విషయాన్ని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి కూడా ధృవీకరించారు. టిడిపిలోని చాలామంది నేతలు తమతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. వైసిపిలో చేరటానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

 

రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్ధితిపై చంద్రబాబులో కూడా అనుమానాలు మొదలైనట్లు సమాచారం. అందుకనే పోయిన ఎన్నికల్లో లాగే రాబోయే ఎన్నికల విషయంలో కూడా నోటికొచ్చిన హామీలను గుప్పిస్తున్నారు. 2 వేల రూపాయల పెన్షన్, డ్వాక్రా మహిళలకు తలా రూ 10 వేలని, ప్రతీ మహిళలకు స్మార్ట్ ఫోనని చెప్పారు. బిసిల్లో యాదవులకు, శెట్టి బలిజలకు, గౌడ్లలకు ఇలా ప్రతీ ఉపకులానికి ఒక కార్పేషన్ ప్రకటించేశారు. డ్వాక్రా మహిళలకు ఇవ్వబోయే రూ 10 వేలకు ఏకంగా పోస్టుపెయిడ్ చెక్కులను ఇచ్చేస్తామంటున్నారు. పోస్టుపెయిడ్ పెడ్ చెక్కులివ్వటం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేదు. ఇవన్నీ ఎందుకు ప్రకటిస్తున్నారంటే రాబోయే ఎన్నికలకు దృష్టిలో పెట్టుకునే అని ఎవరైనా అర్ధం చేసుకోగలరు.

 

పోని ఇంత చేసినా గెలుస్తారా అంటే అనుమానమేనట. అందుకనే చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా నమ్మే జనాలైతే ఉడటం లేదు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నేతలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందుకనే దింపుడు కళ్ళెం ఆశ కూడా ఆవిరైపోతున్న నేపధ్యంలో ప్రజా ప్రతినిధుల పక్క చూపులు చూస్తున్నారు. అందుకే రాబోయే నెల తెలుగుదేశంపార్టీకి చాలా కీలకంగా పలువురు నేతలు భావిస్తున్నారు.  ముఖ్యంగా రాయలసీమ నుండే ఫిబ్రవరిలో చేరికలుంటాయని వైవి చెప్పటం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: