ఏపీ అవ్వాతాతల్లో పెన్షన్ కలవరం.. బ్యాంక్ ఖాతాల్లో జమ కావడం వల్ల అలా నష్టపోతున్నారా?

Reddy P Rajasekhar
ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందు ప్రతి నెలా వాలంటీర్లు ఇచ్చే పింఛన్ తో అవ్వాతాతలు ఎలాంటి కష్టం లేకుండా జీవనం గడిపేవారు. అయితే నిమ్మగడ్డ రమేష్, మరి కొందరు టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల ఫలితంగా రాష్ట్రంలోని అవ్వాతాతలను పింఛన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈరోజు జగన్ సర్కార్ అవ్వాతాతల బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేసిన సంగతి తెలిసిందే. రూల్స్ వల్ల జగన్ సర్కార్ ఇలా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాల్సి వచ్చింది.
 
పింఛన్ డబ్బులు తెచ్చుకోవడానికి చాలా ప్రాంతాలలో వృద్ధులు మండుటెండలో బ్యాంకులకు క్యూ కడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం 3000 రూపాయలు జమ చేసినా కొంతమంది అవ్వాతాతలు బ్యాంక్ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల డబ్బులు కట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎన్ని కష్టాలు సృష్టించవయ్యా చంద్రబాబు అంటూ అవ్వాతాతలు బాధ పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది.
 
వచ్చే 3,000 రూపాయలలో కొంత కోత పడితే నెలరోజులు మిగతా డబ్బుతో జీవనం సాగించడం వృద్ధులకు సులువైన విషయం కాదు. చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చేసిన పనుల వల్ల రాష్ట్రంలోని 60 లక్షల మంది వృద్ధులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రస్థాయిలో నష్టపోవడంతో పాటు ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేస్తే జగన్ కు మంచి పేరు వస్తుందని భావించి చంద్రబాబు చేసిన కుట్రల వల్ల అవ్వాతాత కన్నీరు పెడుతున్న పరిస్థితి నెలకొంది.
 
కొంతమంది అవ్వాతాతలు బహిరంగంగానే బాబుకు ఈ ఎన్నికల్లో ఓటు వేయకుండా వైసీపీకి ఓటు వేసి మరోసారి జగన్ ను గెలిపించుకుంటామని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వృద్ధులు, వికలాంగులను ఇంత మానసిక క్షోభకు గురి చేసిన నేత చంద్రబాబు మాత్రమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నాయకులు కన్నీళ్లు తుడవాలే తప్ప కన్నీళ్లు తెప్పించకూడదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. చంద్రబాబు ఎత్తులు చిత్తు అవుతూ టీడీపీకి భారీ షాకులు తప్పవని ఎన్నికల ముందే ప్రూవ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: