ఐపీఎల్ : ఒకవేళ ప్లే ఆఫ్ మ్యాచ్ లకు.. వర్షం పడితే?

praveen
మార్చి 22వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్ సీజన్.. ఈసారి ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ పంచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగి క్రికెట్ ప్రేక్షకులకి అస్సలు సిసలైన క్రికెట్ మజానీ అందించింది. అయితే ఇక ఇప్పుడు ఈ ఐపిఎల్ టోర్ని ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్లే ఆఫ్ దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేటి నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ జరగబోతున్నాయ్. ఈసారి ప్లే ఆఫ్ లో కోల్కతా, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అర్హత సాధించాయ్.

 ఈ క్రమంలోనే ఈ నాలుగు టీమ్స్ లో ఈసారి ఐపీఎల్ విజేతగా నిలవబోయే జట్టు ఏది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే నేడు ప్లే ఆఫ్ లో భాగంగా పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలలో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ఫై అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది.

 అయితే ఈ ఐపీఎల్ సీజన్ కి అటు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ ప్లే ఆఫ్ లో ఏకంగా మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. మరి ప్లే ఆఫ్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగిస్తే ఎలా అని అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సీజన్లో క్వాలిఫైయర్ వన్, క్వాలిఫైయర్ టు, ఎలిమినేటర్ మ్యాచ్లకు రిజర్వు డే ఏర్పాటు చేశారు. అలాగే మ్యాచ్ ను ముగించడానికి 120 నిమిషాల అదనపు సమయాన్ని కూడా కేటాయించారు. లీగ్ మ్యాచ్ లకు అయితే ఇది 60 నిమిషాలు. ఒకవేళ రిజర్వు డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ఎక్కువ పాయింట్లు ఉన్న జట్టు ముందుకు వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: