జగడం మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!?

Anilkumar
టాలీవుడ్  హీరో రామ్ పోతినేని సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన జగడం సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ తన యాక్టింగ్ తో అదరగొట్టేసాడు అని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సినీ లవర్స్ బ్రెయిన్ లో నుండి వెళ్లలేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఈ సినిమాపై ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి సైతం ప్రశంసల వర్షం కల్పించడు. అసలు జగడం సినిమా ఇప్పుడు విడుదల అయి ఉంటే గనుక నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అని

 చాలామంది ఇప్పటికీ కామెంట్స్ చేస్తూ ఉంటారు.  ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే కదలకుండా అక్కడే కూర్చుని సినిమా మొత్తం కంప్లీట్ చేస్తారు. అలాగే ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు .ఇక ఈ సినిమాకి ఆయన సంగీతం బాగా ప్లస్ అయ్యింది అని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పటికీ సినిమాలోని పాటలు హైలెట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ కి జోడిగా నటించిన హీరోయిన్ మీకు గుర్తుందా.. తన పేరు ఈశా సుహాని. ఇకపోతే ఈ  అనే సినిమాలో మహేష్ బాబు అభిమానిగా కనిపించింది. అలా

 తన క్యూట్ నెస్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పట్లో ఈమె అందానికి ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేవారు. అయితే జగడం సినిమా మంచి విజయాన్ని అందుకోకపోవడం.తో అప్పటినుండి ఈమె కనిపించకుండా పోయింది. ఆ సినిమా తర్వాత మరొక సినిమాలో హీరోయిన్ గా కనిపించలేదు.  ఇన్నేళ్లు అయిపోయింది కానీ ఇప్పటికీ ఆమె ఎలా ఉందో ఎవరికి తెలియదు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉంది అసలు ఏం చేస్తుంది ఎక్కడుంది అని నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తనకి సంబంధించిన పలు లేటెస్ట్ విషయాలు బయటకు వచ్చాయి.. ఇప్పుడు ఈ చిన్నాది ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ డ్యాన్స్ స్కూల్ ను నడుపుతుంది ఇషా సహానీ. ఈ అమ్మడికి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఇషా సహానీ చాలా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: