మా బ్లడ్ వేరు - మా బ్రీడ్ వేరు - మీడియా-మూవీఎస్-పోలిటిక్స్ లో కులగజ్జి విస్పోఠనం టిడిపికి చావుదెబ్బే

కొందరు సినిమావాళ్ళకు నోటిదూల కాస్త ఎక్కువే. ఇక్కడ ఆడ మగ తేడా లేదు. సహజంగా జండర్ డిఫరెన్స్ ఈ రంగంలో పెద్దగా కనిపించదు. విశ్వ వ్యాప్తంగా మానవ జాతిని శాస్త్రీయంగా హోమో శాపియన్స్ అంటారు. ఈ జాతి అందరిలో ప్రవహించే రక్తం ఒకటే. అలాగే బ్రీడ్ కూడా! డబ్బు మద మెక్కి తద్వారా ఒళ్ళు కొవ్వెక్కిన వారి నోటి నుండి మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అనే మాటలు వినిపిస్తున్నాయి.


నిజంగా బ్లడ్డో-బ్లీడో వేరైతే వాళ్లని మనుషులు అనరు. బహుశా వారి అభిమానులు వారిని సింహం అనో! పులి అనో! వారిని పిలుచుకుంటారు గామోసు! అలా జరిగితే వారి జెనస్ & స్పీసెస్ మారి వేరే జంతు వర్గానికో లేక పశు వర్గానికో, పక్షి వర్గానికో - చెందిన వారని వారి (వాటి) గురించి చదువుకోవాల్సి వస్తుంది.


మా వంశం, మా రక్తం, మా బ్రీడ్ అంటూ తొడగొట్టే వారిని వేరేజాతిగా భావించిన జనం,  విమర్శకుల మరియు పత్రికల సమీక్షలు విశేషంగా వచ్చినా, వారు నటించిన సినిమాని కొంతవరకు  బహిష్కరించిన ఫలితమే -  సినిమా వసూళ్ళు చతికిలబడ్డాయి.  నందమూరి బాలకృష్ణ అద్భుతంగా ఎన్టీఆర్ స్థాయిలో నటించాడని విపరీత ప్రచారం ప్రధాన మీడియాలో జరగటం సినిమా వసూళ్లను మట్టిగొట్టుకు పోయేలా చేశాయి. అసలేమాత్రం ఎన్టీఆర్ స్థాయికి చేరని బాలకృష్ణ నటన ఆయన కీర్తిని దిగజార్చిందనవచ్చు. దానవీరశూరకర్ణ సంభాషణలు పలకలేని బాలకృష్ణ నటించటం వలననే కదా! ఆ సినిమాలో ఎన్ టీఆర్ ఒరిజినల్ సంభాషణలు వాడవలసి వచ్చింది. గ్రామాల్లో రికార్డింగ్ డాన్సుల్లో నటులు చెప్పేస్థాయిలో కూడా దానవీరశూరకర్ణ సంభాషణలు లేకపోవటం సిగ్గుమాలిన తనం కాక మరేమిటి?  జనం మన మానవ జాతికి చెందని బ్లడ్ & బ్రీడ్ గాళ్ళను వేరుగా చూడబట్టే మహానటుడు ఎన్టీఆర్ జీవన చిత్రం "ఎన్టీఆర్ కథానాయకుడు" ఆర్ధికంగా మునిగిపోయింది.


దీని ప్రభావం రేపు రాజకీయాలపై పడబోతున్న దాఖలాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఈ మద్య ఈ సామాజిక వర్గం పై ప్రజా వ్యతిరేఖత ఒక స్థాయిలో పెరిగిపోయినట్లు అర్ధమౌతుంది. దానికి కారణం వారు వేరే వారితో కలవక పోవటం, వారు ప్రవేసించిన రంగంలో వేరేవారికి పనిగట్టుకొని అవకాశాలు రానివ్వక పోవటం ముఖ్యంగా సినిమా - మీడియా రంగాలలో వసూళ్ళు సాధించే చోట్ల జనం వారిని వెలివేసే పరిస్థితులు ఎన్టీఆర్ బయోపిక్ తోనే ప్రారభమైనట్లు కనిపిస్తుంది.


ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా "తెలుగుదేశంపార్టీ" రానున్న ఎన్నికల్లో సామాజికవర్గం, బ్లడ్-బ్రీడ్ కారణాలుగా విపత్కర పరిస్థుతులను స్పష్టంగా ఎదుర్కోబోతుంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణ, గుంటూర్, గోదావరి జిల్లాలు, కొన్ని రాయలసీమ గ్రామాల్లో ఈ సామాజిక వర్గ నిట్ట నిలువు విభజన (డిమార్కేషన్) తీవ్ర అసహనం (హేట్రెడ్-నెస్) రోజు వారి సాధారణ వ్యవహారాల్లోనే ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. 


ఉదాహరణగా కూకటపల్లి ఎన్నికల్లో నందమూరి సుహాసిని ధారుణ ఓటమినే చెప్పవచ్చు. నారా చంద్ర బాబు నాయకత్వంలో నందమూరి బాలకృష్ణ, పరిటాల సునీత చేసిన ప్రచారం ఏపిలో వీరి తీవ్ర సామాజిక వర్గ పిచ్చి, బ్లడ్ & బ్రీడ్ అంటూ చేసే తీవ్ర వ్యాఖ్యల ప్రభావమే నందమూరి సుహాసినికి ధారుణ అపజయానికి కారణమని కూకటపల్లి లోకల్స్ విశ్లేషిస్తూ ఉంటారు.  

ఎన్టీఆర్ ను దైవంగా, గొప్ప మానవాతీతుడుగా చూపించిన ఫలితం కూడా అ సినిమాపై సెటైర్లు అంత కంతగా పెరిగిపోవటానికి కారణమైంది. అన్నింటిని మించి ఎన్టీఆర్ వ్యక్తిగత రాజకీయ జీవితంలొని పలు విభిన్న కోణాలను విశ్లేషణాత్మక దృష్టిలో వివరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నాదేళ్ల భాస్కరరావు వీడియో లు జనరంజకంగా సాగిపోవటం ఆ వీడియోల్లో విషయం అత్యంత సరళంగా ఆధ్యంతమూ అర్ధమయ్యేలా ఉండటంతో నందమూరి, నారా కుటుంబాలపై ప్రత్యేకించి చంద్రబాబు ప్రచారం చేసుకునే అబద్ధాల వలన ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతున్న అసహనం దీనికి  ఆజ్యంగా మారింది.


ఉండవల్లి అరుణకుమార్ పాయింట్ బై పాయింట్ చేస్తున్న రాజకీయ విశ్లేషణలు ప్రజలు నిశ్శబ్ధంగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఏపి ప్రధాన మీడియాలలో ఎమి రాస్తున్నారు? ఏమి చూపు తున్నారు అనే విషయావలోకనం ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు తెలిసినంతగా దేశవ్యాప్తంగా మరెవరికీ తెలియదు.

ఎందుకు రాస్తున్నారు? అనే విషయాన్ని సాధారణ గ్రామీణుడు విశ్లేషించినంతగా పట్టణ విద్యావంతునికి కూడా సాధ్యం కావటం లేదు. అందుకే అన్ని ఎన్నికల సర్వేల సారాంశం దగ్గరగా ఉండటానికి కారణం. ఇప్పుడు లగడపాటి ఆక్టోపస్ కూడా ప్రజాభిప్రాయాన్ని మార్చలేదని నిష్ణాతులైన రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట.  టిడిపి కి కొత్త బ్లడ్ కొత్త బ్రీడ్ చేరితే తప్ప తెలుగు దేశం గెలవదు నిలవదు.     

తెలంగాణా ఎన్నికల సమయంలో విపరీతంగా ప్రచారమైన కులపిచ్చికి పరాకాష్ఠ ఆడియో 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: