అల్లరి నరేష్ 'ఆ ఒక్కటి అడక్కు' ఎలా ఉందంటే?

Purushottham Vinay
అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా నేడు విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందంటే కామెడీ సినిమాలా మొదలై.. చివరికి సీరియస్ గా ముగుస్తుంది. నరేష్ నరేష్ ఉన్నంతలో బాగానే నటించినా చివరికి అతను కామెడీ టచ్ కోల్పోయాడన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. కామెడీ పండాలంటే ఎలాంటి అల్లరి చేయాలో నరేష్ కు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అతను తన పాత స్టైల్ వదిలేసి హుందాతనంతో కూడుకున్న పెద్ద మనిషిలా కనిపించాడీ మూవీలో. దీంతో తన పాత్ర నుంచి ఫన్ అంతగా ఏమాత్రం జనరేట్ కాలేదు.చివరికి సహాయ పాత్రలు పోషించిన వాళ్లు  పండించిన వినోదం కూడా అంతంతమాత్రమే. వెన్నెల కిషోర్.. ప్రవీణ్.. వైవా హర్ష.. షకలక శంకర్.. రఘుబాబు.. ఇలా తెర మీద చాలామంది కమెడియన్లు కనిపించినా కూడా ఎవ్వరూ పెద్దగా నవ్వించలేకపోయారు. వెన్నెల కిషోర్ తనకు అలవాటైన హీరో ఫ్రెండు పాత్రలో కనిపించి ఆరంభంలో కొంత ఆశలు రేకెత్తించినా కానీ ఆ తర్వాత సైడ్ మాత్రం అయిపోయాడు. ఆ తర్వాత ఏ పాత్ర తెరపైకి వచ్చినా కామెడీ పండలేదు.


ఇక లెజెండరీ బాలీవుడ్ కమెడియన్ అయిన జానీ లీవర్ కూతురు జెమ్మీ లీవర్ ను తీసుకొచ్చి హీరో వదినగా ఓ ముఖ్య పాత్రే ఇచ్చారు. ఆమె  బాగానే నటించింది. ఈ మూవీలో చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే.. వయసు పెరుగుతున్నా కూడా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న కుర్రాళ్ల బాధను కళ్లకు కట్టినట్లు చూపించడమే.వాళ్ల ఆకాంక్షలను క్యాష్ చేసుకోవాలని చూస్తూ మ్యాట్రిమొనీ సంస్థలు చేసే మోసాల మీద కూడా ఈ మూవీలో చర్చించారు.సెకండ్ హాఫ్ లో ఈ సినిమా కథ రకరకాల మలుపులు తిరుగుతుంది.. ఆ మలుపులు బాగానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కూడా బెటర్. హీరోయిన్ పాత్ర తాలూకు ట్విస్ట్ ఇంటర్వెల్ దగ్గర కథ మీద ఆసక్తి పెరిగేలా చేస్తుంది.అయితే కామెడీ విషయంలో ఫెయిలైనా.. నరేష్ ఓవరాల్ పెర్ఫామెన్స్ బాగానే సాగింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చూడ్డానికి బాగుంది. నటన కూడా ఓకే. కానీ తన పాత్ర ప్రేక్షకులను గందరగోళానికి గురి చేస్తుంది. నరేష్ తో ఫరియాకు జోడీ అయితే బాగానే కుదిరింది. ఈ సినిమా నుంచి కామెడీ ఎక్స్పక్ట్ చెయ్యకుండా కథ పరంగా చూస్తే సినిమా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: