ఏడాదిన్నర ఆడిన సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..!
తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడైనా ముందుగా కథను తయారుచేసుకునేటప్పుడు మహేష్ బాబును దృష్టిలో ఉంచుకొని రాసుకుంటారు. దాదాపుగా ప్రతి దర్శకుడు ఇలానే చేస్తుంటారు. అయితే అన్ని సినిమాలు చేయలేరు కాబట్టి కొన్ని కొన్ని కారణాలవల్ల మహేష్ బాబు తిరస్కరిస్తూ వచ్చారు. అలా తిరస్కరించిన సినిమాల్లో నువ్వే కావాలి ఒకటి. మయూరి ఫిలింస్ రామోజీరావు, స్రవంతి మూవీస్ రవికిషోర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. 2007లో విడుదలైన ఈ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.నిరమ్ రీమేక్ రైట్స్ తీసుకున్న స్రవంతి రవికిషోర్ హీరోగా మహేష్ బాబును ఫస్ట్ ఛాయిస్‌గా అనుకున్నారు.అప్పటికి హీరోగా మహేష్ బాబు తొలి మూవీ రాజకుమారుడు మాత్రమే రిలీజైంది.
మహేష్ అయితేనే హీరో క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్ యాప్ట్ అవుతాడని స్రవంతి రవికిషోర్ భావించారు. నువ్వే కావాలి రీమేక్ గురించి చెప్పి నిరమ్ సినిమాను చూడమని మహేష్‌కు చెప్పారట ప్రొడ్యూసర్. హీరో పాత్ర తన ఇమేజ్‌కు సరిపోతుందో లేదా అనే డైలామాలో మహేష్‌బాబు నువ్వే కావాలి రీమేక్‌లో నటించలేకపోయారు.మహేష్ బాబు తర్వాత సుమంత్, బాలీవుడ్ హీరో అప్తాబ్ దాసానీ తదితరులకు కూడా ఆడిషన్ టెస్ట్ జరిపారు.
దర్శకుడు విజయ్ భాస్కర్ కు వీరెవరూ నచ్చలేదు. ఒక యాడ్ లో కలిసి నటించిన తరుణ్, రిచా అయితే బాగుంటారని వారిని ఎంపిక చేశారు. కోటిరూపాయల బడ్జెట్ తో నిర్మితమై దాదాపు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది. 20 కి పైగా థియేటర్లలో 250 రోజులకు పైబడి ఆడింది. మరికొన్ని థియేటర్లలో అయితే షిఫ్ట్ చేసి ఏడాదిన్నరపైగా ఆడింది. మహేష్ బాబు నటించివుంటే ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకునేవాడు.ప్రస్తుతం మహేష్ బాబు దిగ్గజ దర్శకుడు రాజమౌళితో అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ చేస్తోన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌పనులు జరుగుతోన్నాయి. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది.