యుద్దం జరగక పోయినా సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?

ప్రస్తుతం మన సరిహద్దులలో యుద్ధ పరిస్థితులు ఏవీ లేనప్పటికీ, అన్యాయంగా శత్రువుల చేతిలో మన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనికి వేరెవరో కారణం కాదని, ఇది కేవలం మన కర్తవ్య నిర్వహణ లోపమని ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రజల వైపునుంచి కూడా తగిన తోడ్పాటు ఉండాలని, మనం దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టా లంటే, కొన్ని త్యాగాలకు పూనుకోవాల్సి ఉంటుందని, దేశ భద్రత కేవలం సైనిక బలగాలకు సంబంధించిన వ్యవహారం కాదని ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లుగా ఈ అంశం ప్రభుత్వం చూసుకుంటుందని, ఆర్మీ చూసుకుంటుందని, పోలీసులు చూసుకుంటారని భావించవద్దని సమాజంలో ప్రతిఒక్కరూ ఇందుకోసం కృషి చేయాలి అని అన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ (ఆరెసెస్) కు ఆయన సార్సంగ్ చాలక్ (అధినేత) మోహన్ మధుకర్ భగవత్.  గురువారం నాగ్‌పూర్‌లో జరిగిన "ప్రహార్‌ సమాజ్‌ జాగృతి సంస్థ" సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

స్వాతంత్రం సిద్ధించి 70ఏళ్లు గడుస్తున్నా, ఇతర దేశాలతో పోలిస్తే అభివృద్ధిలో గాని, పురోగమనంలో గాని పూర్తిగా వెనుకబడి ఉన్నామంటున్న భగవత్‌ ఈ సందర్భంగా మనకు ఉదాహరణగా ఇజ్రాయెల్‌ ను ఉదహరించారు. 19వ శతాబ్దంలో అనేక కారణాల తో విభిన్న ప్రాంతాలకు వలస వెళ్లిన ఆ దేశస్థులు తిరిగి దేశంలోకి వచ్చి వర్తక, వ్యాపారాలు చేస్తూ 1948 లో స్వాతంత్రం  సాధించుకుని ఇప్పుడు ప్రపంచం లోనే  ప్రత్యేక స్థానం సంపాదించారని అన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ “యుద్ధం జరగని క్రమంలో సరిహద్దులలోనేకాదు అంతర్గతంగా కూడా సైనికులు మర్ఫణించవలసిన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు పోరాడాలి. ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీతో బాటుగా సాధారణ పౌరులు కూడా దేశభద్రతలో తమ వంతు పాత్ర పోషించాలి. దేశంలో అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. ద్రవోల్బణం పెరిగింది. నిరుద్యోగం పెరిగింది. వీటికి మనమెవరో కారణం కానేకాదు. అయినప్పటికీ వీటి ఫలితాన్ని మాత్రం మనం అనుభవించాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి కారణం మనమందరం మన పని మనం సరిగ్గా చేయక పోవటమే. అందుకే ఇకపై దేశం కోసం జీవించడం అలవర్చుకోవాలి. అప్పుడే అందరూ బాగుంటారు  అని మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: