ఎడిటోరియల్ : ఏపీలో సీన్ మారుతుందా...!!

Satya
ఏపీలో గత నాలుగు దశాబ్దాలుగా నలిగిపోయిన పార్టీ టీడీపీ. అన్న నందమూరి పాటీని స్థాపించినపుడు ఉన్న వర్గాలన్నీ ఈ రోజుకూ దాదాపుగా ఆ పార్టీకి మద్దతుగా ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో టీడీపీ బలంగా పోరాడుతూందంటే ఆ వర్గాల కీలక మద్దతే కారణం. బీసీలు ఓ విధంగా టీడీపీని సొంతం చేసుకున్నారు. మరి టీడీపీ వారిని అంతలా సమాదరించిందా అన్నదే ఇక్కడ ప్రశ్న.


బీసీ ఓట్లపై కన్ను :


చాలాకాలంగా  వైసీపీ ఏపీలో రాజకీయాలను మలుపు తిప్పేందుకు చూస్తోంది. జగన్ పాదయాత్రలో భాగంగా బీసీల జపం మొదలెట్టారు. తన వెనక ఉన్న వర్గాలకు తోడు ఏపీలో బలంగా ఉన్న బీసీలు తోడు అయితే గెలుపునకు తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో బీసీలకు పెద్ద పీట వేస్తానని, వారికే ఎక్కువగా సీట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి కాపుల రిజర్వేషన్ల మీద కూడా జగన్ తన స్టాండ్ ఇదీ అని చెప్పారు. దాంతో ఏపీలో బీసీల్లో పునరాలోచన మొదలైంది. జగన్ చేతల మనిషి అని కూడా అర్ధమైంది. ఇంతకాలం టీడీపీకి బోయీలుగా మారి ఏం బావుకున్నామన్న చర్చ కూడా ఆయ వర్గాల్లో జరుగుతోది.


టీయారెస్ ద్వారా :


ఇవన్నీ ఇలా ఉంచితే బాబుకు గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెబుతున్న కేసీయార్ ఏపీలో రాజ‌కీయాన్ని తారు మారు చేయడానికి తన వంతుగా క్రుషి చేస్తున్నారు. తన బలాన్ని, వ్యూహాలను వైసీపీ గెలుపునకు ఇవ్వడం ద్వారా బాబుని ఓడించాలనుకుంటున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీకి వచ్చారు. కోడి పందేలను చూసే నెపంతో ఆయన వచ్చినా ఇక్కడ తన సామాజిక వర్గాన్ని బాబుకు వ్యతిరేకంగా తిప్పడానికే ఆయన రాక ఆంతర్యమన్నది తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గం ఏపీలో బలంగా ఉంది. వారి జనాభా కూడా ఎక్కువ. వారికి సరైన నాయకత్వం లేక టీడీపీకి మద్దతుగా ఉంటోంది. ఇపుడు తలసాని వైపుగా ఆ వర్గం ర్యాలీ అవుతోంది. ఎటూ చంద్రబాబు ఓటమిని కోరుకుంటున్న తలసాని వారిని వైసీపీ వైపుగా మరల్చడంతో తన వంతు పాత్ర పోషిస్తారని అంటున్నారు


ఆ వర్గం ఎటు :


ఇక ఏపీలో మరో కీలకమైన సామాజిక వర్గం వెలమలు టీడీపీకి మద్దతుగా ఉంటున్నారు. టీయారెస్ అధినాయకుడే ఆ సామజిక వర్గం. పైగా ఆయన బాబుకు వ్యతిరేకం. జగన్ కి స్నెహ హస్తం అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో వెలమలు కూడా తమ రూటు మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ విజయాన్ని శాశించే స్థాయిల్లో అయిదారు జిల్లాలో వెలమల ప్రాబల్యం ఉంది. వారు కనుక టీడీపీకి రాం రాం అంటే ఏపీలో ఆ పార్టీ పునాదులు కదలడం ఖాయంగా ఉంటుంది.


ఆయన కూడా సై :


ఇక ఏపీలో సీమ జిల్లాలతో పాటు, గుంటూరు తదితర ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ జగన్ తరఫున ఏపీలో ప్రచారం చెస్తానని చెబుతున్నారు. ఆయన కనుక కదలి వస్తే ఏపీలో మైనారిటీలు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ వైపుగా మళ్ళడం జరుగుతుందంటున్నారు. నిజానికి ముస్లిం వర్గాలు ఇప్పటికే ఏపీలో పెద్ద సంఖ్యలో వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఇపుడు వారికి ఐకాన్ లాంటి అసదుద్దీన్ రంగంలోకి దిగితే అది టీడీపీకి చుక్కలు చూపించే పరిణామమే అవుతుంది. 


కొత్త సొషియో ఫ్యాబ్రిక్ :


ఏపీలో రానున్న ఎన్నికల్లో కొత్త సామాజిక సమీకరణలు చూడగలమా అనిపిస్తోంది. రెడ్డి, క్రిస్టియన్, ముస్లిం, బీసీ, వర్గాల సమాహారంగా వైసీపీ కనుక రూపు దిద్దుకుంటే మాత్రం  రాజకీయంగా ఆ పార్టీ గట్టిగా మారడమే కాదు టీడీపీ తరహాలో దశాబ్దాల తరబడి నిలిచి గెలిచేందుకు బలమైన పునాదులే పడతాయని అంటున్నారు. అందుకు పూర్వ రంగం ఇపుడు సిద్ధం కాబోతోంది. మరి. దాని ఫలితాలు ఎలా ఉంటాయన్నది రాజకీయ తెర మీద చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: