చంద్రబాబు తీరుపై కుమారస్వామి కొట్టిన దెబ్బ మామూలుగా లేదుగా!

ఒక వైపు సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్నట్లు చెప్పుకునే ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన రాష్ట్రంలో ఎక్కడ ఆదాయపన్ను శాఖ దాడులు జరిగినా అది తన కుటుంబం, తన పార్టీ,  తన సామాజిక వర్గం పైనే  జరిగినట్లు విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాదు తను అనుకున్నట్లు తనపై జరిగే ఐటి దాడులు, విచారణ - నిఘా సంస్థల పరిశీలనలను మొత్తం రాష్ట్రం పై కేంద్రం సాగించే దౌర్జన్యంగా ప్రచారం చేయటానికి కూడా బలమైన సమాధానమే. అలా కర్ణాటకలో పన్ను ఎగవేత దారులపై దాడిచేసి ఐటీ శాఖ వందకోట్ల రూపాయల అపరాధ రుసుం రూపేణా ప్రభుత్వానికి ఆదాయం సంపాదించి పెట్టింది.  
 
అయితే అతి తక్కువ రాజకీయ అనుభవమున్న కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం హుందాగా సమాదానం చెప్పిన తీరు గౌరవప్రదంగా ఉంది. ఒక ఉన్నత రాజ్యాంగ  పదవుల్లో ఉన్నవారు వివిధ వ్యవస్థలపై గౌరవం ప్రదర్శించవలసిన అవసరాన్ని తన స్పందనను ప్రకటించారు. కర్ణాటకలో సినీనటులు, కొందరు వ్యాపార ప్రముఖులపై ఆదాయపన్ను శాఖ దాడులు  జరిపిన దరిమిలా,  దానిపై రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. చిట్టచివరికి  సినీనటిగా ఉన్న కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి ఇంటిలో కూడా సోదాలు జరిగాయి.
 
ఈ సోదాలకు సంబందించి మీడియా, ముఖ్యమంత్రి కుమారస్వామిని ప్రశ్నిస్తే ఆదాయపన్ను శాఖ తన పని తాను చేసుకుంటుందని, ఇలాంటి వాటిలో రాజకీయాలు చేయకూడదని వ్యాఖ్యానించారు. ఐటి వారికి ఏదో సమాచారం లభించి ఉండవచ్చని దాని తర్వాతే వారు సాధారణంగా సోదాలు చేస్తారని, అదే ఇక్కడ కూడా జరిగిఉంటుందని ఆయన అన్నారు. "సోదాలు చేసినప్పుడు, వారికి తదనుగుణంగా ఏమీ లభించక పోతే వారు మాత్రం చేసేది ఏముంటుంది? అని కుమారస్వామి అన్నారు.


కాగా కర్నాటకలో నటుల ఇళ్ల సోదాల ఫలితంగా ఐటి శాఖకు ₹109 కోట్ల పన్ను కట్టడానికి వారు ముందుకు వచ్చారని తాజా సమాచారం. ఆదాయపు పన్ను శాఖ ఆ విధంగా గౌరవిచటంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన గౌరవం రెట్టింపైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: