తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వారికి ఆ కష్టాలు తప్పవా..?

Pulgam Srinivas
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సంవత్సరాలు ఎంతో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చెలరేగాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు అయితే తెలంగాణ ప్రజలందరికీ ఉద్యోగాలు , ఉపాధి , రోడ్డు వసతులు , కరెంటు వసతి , రైతుల జీవన స్థాయి ప్రమాణాలు మరి అనేక విషయాలలో మనం ఎంతో ముందుకు పోతాము అని , మన వనరులు అన్ని వృధా అవుతున్నాయి అని రాజకీయ నాయకులు చెప్పారు. ప్రజలు కూడా నిజమే మనకు కనుక ప్రత్యేక తెలంగాణ వచ్చినట్లు అయితే మనం చాలా విషయాలలో ముందుకు వెళతాం అని భావించారు.

ఇక అనేక కొట్లాటల తర్వాత 2014 వ సంవత్సరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక వీరికి అంత మెజారిటీ రావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమంలో మీరు పాత్ర కీలకంగా ఉండటమే. ఆ తరువాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ మరింతగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన టిఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు.

ఇకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా విషయాల్లో మంచి పరిపాలన కొనసాగించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో , చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయడంలో టిఆర్ఎస్ ఫెయిల్ అయ్యింది. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వీరైన ఆ కొరతను తీరుస్తారా..? లేక అలాగే అడవి ప్రాంతాల్లో , చిన్న చిన్న గ్రామాలకి మెరుగైన రోడ్డు వసతులను కల్పించడంలో ఫెయిల్ అయ్యి ప్రజలకు నిరాశే మిగులుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: