క్రిశాంక్ కిడ్నాప్ అయ్యారు...మంత్రి జగదీష్ రెడ్డి..!

Pulgam Srinivas
నల్గొండ (బీ ఆర్ ఎస్) పార్టీ కార్యాలయంలో సూర్యాపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో భాగం గా ఈయన (బీ ఆర్ ఎస్) సోషల్ మీడియా ఇంచార్జి క్రిశాంక్ ను చౌటుప్పల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అనే విషయంపై మాట్లాడారు . తాజా ప్రెస్ మీట్ లో భాగంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... (బీ ఆర్ ఎస్) సోషల్ మీడియా ఇంచార్జి క్రిశాంక్  ను చౌటుప్పల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు  . పోలీసులు అరెస్ట్ చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేస్తాము.

సోషల్ మీడియా , యూట్యూబ్ ఛానల్ లపై కేసులు పెడుతున్నారు . పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాదిరి పని చేస్తున్నారు. (బీ ఆర్ ఎస్) కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి మంత్రులను కలవమంటున్నారు . కంట్రాక్టర్ లను బెదిరించి బిల్లులు ఆపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైంది . అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను బెదిరించి పని చేయించుకుంటున్నారు. నాలుగు నెలల్లో పెయిల్ అయిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.

ఒక్క నోటీసుకే ఒనికి పోయి హంగామా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి , అయన బూట్లు తుడుస్తున్న మంత్రులు పోలీసులు , జైళ్లు అనే పదం వాడకుండా పరిపాలన చేయలేకపోయారు. మోదీ బడే బాయి తరహాలో.. చోటే బాయి రేవంత్ కూడా జైలు భాష వాడుతున్నారు. ప్రజా స్వామ్యంను మర్చిపోయి డ్రామాలతో పాలన చేస్తున్నారు. క్రిశాంక్ అడ్రెస్ ఎక్కడో వెంటనే డీ జీ పీ సమాధానం చెప్ప్పాలి అని సూర్యాపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో భాగంగా కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

jr

సంబంధిత వార్తలు: