ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన గౌరవం.. కేసీఆర్‌కు అసదుద్దీన్ థ్యాంక్స్..

Chakravarthi Kalyan
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన గౌరవం లభించింది. కొత్త అసెంబ్లీకి ప్రొటెంస్పీకర్ గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌ను ప్రొటెం స్పీకర్‌ గా ఎన్నిక చేయడం ఆనవాయితీగా వస్తోంది.



ప్రస్తుతం చార్మినార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముంతాజ్‌ అహ్మద్ ఖాన్ 1994 నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. అందుకే ఆయనకు ఈ గౌరవం దక్కనుంది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ట్వీట్‌ చేసారు. ఈ అవకాశం కల్పించిన కేసీఆర్‌ కు థ్యాంక్స్ చెప్పారు.



జనవరి 17, 2019 న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16, 2019 న సాయంత్రం 5 గంటలకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ్ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేస్తారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. శాసనసభ కార్యకలాపాలు 17 జనవరి నుండి 20 జనవరి వరకు వుంటాయి.



జనవరి 17, 2019 న అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11-30 గంటలకు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ఆ తరువాత ఒకరివెంట ఒకరు ప్రమాణం చేస్తారు. అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు వుంటాయి. జనవరి 18 న స్పీకర్ ఎన్నిక ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: