చంద్రబాబుపై నరెంద్ర మోడీ సంధించనున్న పాశుపతాస్త్రం?

చంద్రబాబు లో ఈ మద్య తెలియని నిరాశ నిస్పృహలు ఆయన మాటల్లో, నడవడికలో, ప్రవర్తనలో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆయన్ని బాగా ఎరిగిన వారు – వారితో పాటు ఆయనను వ్యక్తిగతంగా చూసిన రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితి ముఖ్యంగా తెలంగాణా ఎన్నిక‌లు మిగిల్చిన తీవ్ర నిరాశ‌ను నుండే జనించాయని అంటున్నారు. ఆ తరవాత ప్రధాని నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైనప్పటి నుండి మరీ ఎక్కువైందని అంతర్జాలం కోడై కూస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో చంద్రబాబులో ప్రకంపనాలు మొద‌ల‌య్యాయని అందరూ అంటున్నారు. 

ఒక వేళ ప్రజా కూట‌మి అధికారంలోకి వ‌చ్చిఉంటే ప‌రిస్థితి మరో విధంగా ఉండేదని కూడా అంటున్నారు. కాని ప్రజా కూట‌మి వత్ర్ణించటానికి అలవి కాలేనంత చిత్తుగా ఓడింది. ఒక వైపు ఏపీలో సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యం, మరో వైపు “ఓటుకు నోటు కేసు” భ‌యం చద్రబాబును లోలోపల దహించివేస్తుంది.  తెలంగాణా ఎన్నిక‌ల‌ల్లో ప్రజా కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని భాగీగానే ఆశ‌లు పెట్టుకున్నారు చంద్రబాబు. సీట్ల పంప‌కాల‌ నుంచి ఎన్నిక‌ల ఖ‌ర్చు అంతా నెత్తిపై వేసుకొని న‌డిపించారు. అధికారం లోకి వ‌చ్చి ఉంటే చంద్రబాబు చ‌క్రం తిప్పి ఉండేవాడు. దాంతో ఓటుకు నోటు కేసు నుంచి భ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని పెట్టుకున్న ఆశ‌లు ధారుణంగా అడియాశ‌ల‌య్యాయి.  ఇప్పుడు ఆయన త్రిప్పవలసింది చక్రం కాదు పొత్రం అంటున్నారు విమర్శకులు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఎప్ప‌టికైనా ఓటుకు నోటు కేసు బాబు మెడ‌కు చుట్టుకోక‌ త‌ప్ప‌దు. ఆ కేసు ఎంత వ‌ర‌కు వ‌చ్చిందో తెలియదు. ఓటుకు నోటు కేసులో చంద్ర బాబు, రేవంత్ లతో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా నిందితుడే. వ్యూహాత్మ‌కంగానే రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లోకి చంద్రబాబే పంపించాడ‌నే వార్త‌లు సర్వత్రా వినిపిన్చాయి. 

ఎన్నిక‌ల ప్ర‌చారంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌ పై అలవి కాని దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో ఇక ఆయన తీరు ఎలా మారుతుందో చూడాలి. కొడంగల్ లో ఓడితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరిన రేవంత్ రెడ్డి దాన్ని చెత్త‌బుట్ట‌లో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. ఓటుకు నోటు కేసు లో ఈ ముగ్గురు నాయకుల‌లో సండ్ర వెంకట వీరయ్య ఇప్పుడు కారెక్కేయటం ఈ ముగ్గురికీ ప్రమాద ఘంటిక‌లు మోగాయ‌నే అనుకోవాలి.

గులాబీ పార్టీ లోకి వచ్చిన తర్వాత, సండ్రకు ఏదైనా పెద్దపదవి దక్కినా, అందలం ఎక్కించినా, దానికి మించిన స్కెచ్ ఏదో వారి మదిలో ఉన్నదనే అనుకోవాలి. ఇప్పుడు ఓటుకు నోటు కేసును తిరగ తోడడం అంటూ జరిగితే, గులాబీ గూటికి చేరిన సండ్ర చిలక — ఆ గులాబీ గూటి పలుకులే పలుకుతుందనడంలో సందేహంలేదు. ఆయన అటువైపు మాట్లాడితే చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి  చిప్పకూడు తప్పదు. అసలే చంద్రబాబు ఫోన్-కాల్ రికార్డింగ్ కూడా ఒక సాక్ష్యంగా ఇప్పటికే ఉంది.

ఓటు నోటు కేసు గుదిబండగా మారి మెడకు చుట్టుకుంటుందని చంద్రబాబు భయపడు తున్నట్లు కనిపిస్తోంది. మ‌రో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి వేసిన పిటిష‌న్‌ పిబ్రవరి లో విచారిస్తామ‌ని ఇప్ప‌టికే  సుప్రీంకోర్టు తెలిపింది. అదే స‌మ‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉండటం తో అటు రాజకీయంగా ఇటు నైతికంగా మరో ప్రక్క చట్టపరమైన శిక్షలతో చంద్రబాబుకు చిక్కులు త‌ప్ప‌వని అంటున్నారు.  


చంద్రబాబుకు ఆసమయానే అనేక ఇబ్బందులు ముప్పిరిగొనే సూచనలు కనిపిస్తున్నాయి. గతం వెంటాడే సూచనలున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలకు పోటీగా విడుదలయ్యే "లక్ష్మిస్ ఎన్టీఆర్" ఆయనకు తలబొప్పికట్టే సమస్యలకు, అవమానాలకు తోడు వెన్ను పోటు చరిత్ర ఈ తరానికి కూడా పరిచయమై సాంగోపాంగంగా మారి పరువు ప్రతిష్టలు కోల్పోయే పరిస్థితులు దూసుకు రానున్నాయని విశ్లేషకుల భావన. అదే ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: