రజినీ బయోపిక్ లో ధనుష్.. వర్క్ అవుట్ అయ్యిద్దా?

Purushottham Vinay
సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బయోపిక్ లు తెరకెక్కడం చాలా రేర్. ఇంట్రెస్టింగ్ బయోపిక్ లు ఎన్నో ఉన్నా? ఆ తరహా ప్రయోగాలు బాలీవుడ్ దర్శకులు ఈజీగా చేస్తారు కానీ సౌత్ మేకర్స్ మాత్రం అంత తొందరగా చేయలేరు.జయలలిత...ఎన్టీఆర్..రాజశేఖరెడ్డి...ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి లెజెండ్స్ బయోపిక్స్ సౌత్ లో కొన్ని తెరకెక్కాయి. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని... వాస్తవ సంఘటనలు ఆధారంగా మరికొన్ని సినిమాలు తెరకెక్కాయి. అయితే బాలీవుడ్ లో సక్సెస్ అయినంతగా ఇక్కడ సక్సస్ కాలేదన్నది మాత్రం వాస్తవం.కేవలం కొన్ని కథలు తప్ప అన్ని ఇక్కడా సక్సెస్ కాలేదు. తలైవి(జయలలిత)..ఎన్టీఆర్ బయోపిక్ సౌత్ లో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి కూడా రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాప్ నిర్మాత సాజిద్ నడియావాలా ఆ ఛాన్స్ తీసుకుంటున్నారు. బస్ కండెక్టర్ టూ సూపర్ స్టార్ దాకా రజనీ ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టబోతున్నారు. అయితే ఈ మూవీకి దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ రజనీ పాత్ర బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు? వంటి విషయాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి.ఇంకా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదుగానీ... నిర్మాత సాజిద్ రజనీతో సినిమా అనౌన్స్ చేయడంతోనే ఈ విషయం వెలుగులోకి వస్తోంది. 


అయితే సూపర్ స్టార్ రజనీ కాంత్ పాత్రలో ధనుష్ నటిస్తున్నాడని కూడా బలమైన ప్రచారం సాగుతుంది. అన్ని రకాలుగా కూడా ఆ పాత్రకు కేవలం ధనుష్ మాత్రమే న్యాయం చేయగలడని కోలీవుడ్ మీడియాలో కూడా అనేక రకాల వార్తలొస్తున్నాయి. కానీ ఆ ఛాన్స్ ధనుష్‌కి రజనీకాంత్ ఇస్తారా? లేదా? అన్నది మాత్రం ఇప్పుడు క్లారిటీ లేని అంశం.ఎందుకంటే ధనుష్‌...సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఐశర్య -ధనుష్ 2004 లో వివాహం చేసు కోవడం..ఇటీవల వాళ్ళు విడిపోవడం..పైగా ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండటం తెలిసిందే.ఈ జంట విడిపోయే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వారికి ఎంతో నచ్చ చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ విడిపోయిన మనసులు మళ్లీ కలవవని కోర్టులో విడాకుల పిటీషన్ ఇటీవలే వారు దాఖలు చేసారు. సరిగ్గా ఇదే సమయంలో రజనీకాంత్ బయోపిక్ లో ధనుష్ నటించడం అన్నది జరుగుతుందా? రజనీకాంత్ ఆ ఛాన్స్ మాజీ అల్లుడికి ఇస్తారా? అన్నది సందేహమని కోలీవుడ్ మీడియా కథనాలు హీట్ పుట్టిస్తున్నాయి.ఇదిలా ఉంటే నేడు ధనుష్ కుబేర టీజర్ విడుదల అవ్వాల్సి ఉంది కానీ ఇంకా ఎందుకో విడుదల కాలేదు. చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: