శబరిమలలో మళ్లీ టెన్షన్..ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసి కొండదించిన మహిళా పోలీసులు!

siri Madhukar
భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన పుణ్యస్థలం శబరిమల. అలాంటి శబరిమల ఆలయం ఈ మద్య ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది.  అయ్యప్ప స్వామిని ఆడవారు కూడా దర్శనం చేసుకోవచ్చు అని కోర్టు తీర్పుతో ఈ వివాదం రాజుకుంది.  ఆ మద్య ఓ విలేఖరి, సామిజిక వేత్త స్వామి వారిని దర్శంచుకునే ప్రయత్నం చేయగా భక్తులు, ఆలయ పూజారులు అడ్డుకున్నారు.  దాంతో వారు వెనుదిరిగారు..ఆ తర్వాత శబరిమల ఆలయానికి వెళ్లాలనుకున్న సామాజిక వేత్త తృప్తీ దేశాయ్‌ని కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకున్నారు బీజేపీ నేతలు, అయ్యప్ప భక్తులు..దాందో ఆమె కూడా వెనుతిరిగిపోయారు. 

ఇప్పుడు మళ్లీ శబరిమలలో మళ్లీ టెన్షన్.. టెన్షన్.. వాతావరణం నెలకొంది.  50 సంవత్సరాలలోపు వయసున్న ఇద్దరు మహిళలు, శబరిమలకు బయలుదేరి, పంబ దాటి, సన్నిధానానికి కిలోమీటర్ దూరం వరకూ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున భక్తులు వారిని అడ్డుకుని, రహదారిపైనే కూర్చుని శరణుఘోషను ప్రారంభించగా, పోలీసులు, అదనపు బలగాల కోసం వేచి చూశారు.  వీరిద్దరూ పంబకు వచ్చిన తరువాత, భక్తుల నిరసనల మధ్యే, పోలీసుల సహకారంతో కొండ ఎక్కడం ప్రారంభించారు. 

కానీ భక్తుల నిరసన తీవ్ర రూపం దాల్చడంతో..బిందు, దుర్గలను మహిళా పోలీసులు బలవంతంగా కిందకు దించారు. సన్నిధానానికి కిలోమీటర్ దూరంలోని మరక్కూటం వద్ద ఈ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. వారంతట వారుగా కిందకు వెళ్లాలని, పరిస్థితులు సద్దుమణిగిన తరువాత స్వామి దర్శనానికి మరోమారు రావచ్చని పోలీసు ఉన్నతాధికారులు వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. 

బిందు, దుర్గలు మాత్రం పోలీసులు ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదు..దాంతోవారిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, బలవంతంగా పంబకు చేర్చారు. అక్కడి నుంచి వారిని నీలక్కల్ కు పంపించనున్నామని, ఆలయం వద్ద పరిస్థితి ప్రశాంతంగానే ఉందని అధికారులు ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: