మోడీ కి గట్టి కౌంటర్ సిద్ధం చేసిన టీడీపీ..!

KSK
ఏపీలో ఎన్నికలు వస్తున్న తరుణంలో త్వరలో ఏపీ బిజెపి పార్టీ ప్రధాని మోడీ తో ఏపీ నూతన రాజధాని గుంటూరు ప్రాంతాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో మోడీ రాష్ట్రానికి రాబోతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు మండిపడుతున్నారు.  


ఏ ముఖం పెట్టుకొని మోడీ గుంటూరుకు వస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పిన తర్వాతే గుంటూరు సభలో అడుగుపెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గుంటూరు సభకు వచ్చే ముందు ఢిల్లీలో ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.


మరోవైపు ప్రధాని మోడీ గుంటూరు సభ ద్వారా ఏపీకి ఇచ్చిన నిధులను ప్రకటించే అవకాశం లేకపోలేదు. దీంతో టీడీపీ నేతలు భయపడుతన్నారని  బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


అయితే ఇదే క్రమంలో 2014 నుండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్ని నిధులు విడుదల చేసింది అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా తెలుగుదేశం పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఎన్నికల ముందు మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడుతున్న క్రమంలో అటు బిజెపి ఇటు టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు వర్షం కురిపించడం ఏపీ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: