అర్థరాత్రి చంద్రబాబుకు జలక్ ఇచ్చిన ఉత్తమ్..

Chakravarthi Kalyan

టీడీపీ అధినేత చంద్రబాబుకు కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అర్థరాత్రి జలక్ ఇచ్చారు. మహా కూటమిగా జట్టుగా ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్, టీడీపీ మైత్రికి ఊహించని షాక్ ఇచ్చారు. పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించిన స్థానంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికే ఓటేయమని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారుగ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించింది.



ఇక్కడ తెలుగుదేశం తరపున సామ రంగారెడ్డి బరిలో దిగారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. కానీ పొత్తుల్లో ఈ సీటు కాంగ్రెస్ కు కేటాయించడం కుదరలేదు. దీంతో ఆగ్రహించిన మల్ రెడ్డి రంగారెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగారు. బీఎస్పీ నుంచి టికెట్ సంపాదించుకుని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. పేరుకు బీఎస్పీ అయినా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగానే ప్రచారం చేసుకున్నారు. మూడు రంగుల జెండాలో ఏనుగు గుర్తు ఉన్న జెండాలతో ప్రచారం హోరెత్తించారు.



ఇక్కడ ప్రజాకూటమి తరపున బరిలో ఉన్న సామ రంగారెడ్డి వాస్తవానికి ఎల్బీనగర్ సీటు ఆశించారు. ఆయనకు ఇబ్రహీంపట్నంలో ఏమాత్రం పట్టులేదు. కానీ అనేక సమీకరణాల కారణంగా సామ రంగారె‌డ్డి ఇబ్రహీం పట్నం కేటాయించాల్సి వచ్చింది. ఆయనా అయిష్టంగానే బరిలో దిగారు.



మల్ రెడ్డి రంగారెడ్డి బలమైన అభ్యర్థి కావడంతో ఇక్కడ ఆయన గెలవబోతున్నారని సర్వే కింగ్ లగడపాటి రాజగోపాల్ కూడా జోస్యం చెప్పారు. అనేక చోట్ల తిరుగుబాటు అభ్యర్థులను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ మల్ రెడ్డిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఆయన గెలుపు ఖాయం అని తేలడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్ రెడ్డికే ఓటేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అసలే తక్కువ సీట్లలో పోటీ చేస్తున్న టీడీపీకి ఇప్పుడు మల్ రెడ్డి రూపంలో మరో దెబ్బ పడిందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: