రాహుల్ ఒక కన్-ఫ్యూజ్డ్- 'గందర గోళం గాంధీ' !

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకు పడింది. తాను “హిందువు” నని ఆయన చెప్పుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించేనని పేర్కొంది. ఆయనను  "తికమక మకతిక గాంధి” (గందరగోళం గాంధీ) అంటూ అభివర్ణించింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిన్న శనివారం మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ సమస్య అల్లా ఆయన “కన్ఫూజన్ గాంధీ" కావడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై బీజేపీ విరుచుకు పడింది. తాను “హిందువు” నని ఆయన చెప్పుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించేనని పేర్కొంది.

ఆయన హిందూ వేష భూషణాలు ధరించటం రాజకీయ ప్రయోజనాలను ఆశించేనని, అందులో నిబద్ధత ఏమీ లేదని అన్నారు. రాజకీయ అనివార్యతలను బట్టే ఆయన హిందూ విశ్వాసాలు మారుతుంటాయని విమర్శించారు. అంతకు ముందు, రాహుల్ గాంధి ఒక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ “ఎలాంటి హిందువు?” అంటూ ప్రశ్నించారు. హిందుత్వం గురించి ఆయనకు ఏమి తెలుసునని నిలదీశారు. 


'హిందుత్వ సారాంశం, భగవద్గీత ఏం చెబుతోందనే విజ్ఞానం అందరి వద్దా ఉంది. జీవించే ప్రతి ఒక్కరికీ విజ్ఞానం ఉంటుంది. ప్రధాని తాను “హిందువు” నని అంటారు. కానీ ఆయన హిందుత్వ మూలాలను అర్థం చేసుకోలేదు. ఆయన ఏ రకమైన హిందువు?' అని విమర్శించారు. అందులో నిబద్ధత ఏమీలేదని అన్నారు. రాజకీయ అనివార్యతలను బట్టే ఆయన హిందూ విశ్వాసాలు మారుతుంటాయని విమర్శించారు.

ఆయన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందిస్తూ, రాహుల్ గాంధి 'హిందూ అభినయం' వెనుక రాజకీయ కారణాలున్నాయంటూ ప్రతి విమర్శలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: