"సిబీఐకి నొ ఎంట్రీ" తరవాత పరిణామాలు - బాబూ! తీరు మార్చుకోవటం మీకు చాలా అవసరం

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధితో తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మంచి మైత్రి కుదిరినా, భవిష్యత్తులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధి నుండి స్ట్రొక్ – ప్రధాని నరేంద్ర మోడీ నుండి పోటు తప్పదు. ఆయన వీరిద్ధరి మద్య సాంద్విచ్ అవ్వకపోవటం జర్ఫగదని గ్యారంటీ ఏమీ లేదు. దేశం మొత్తానికి చంద్రబాబు తరహా రాజకీయాలు బట్టబయలయ్యాయి. భారత సకల జనావళి కి ధిక్కుమాలిన నీచ నికృష్ఠ రాజకీయాలు రచిస్తే – వాటిని ఈ విశ్వజనీనానికి ప్రచారం చేసి సహకరించే తెలుగు సామాజిక వర్గ  సమాచార వాహిని సంక్షిప్తంగా “పచ్చ మీడియా” చేసే ద్రోహం నిర్వచించటానికి బాష చాలదు – భావం ఉండదు. ప్రజాస్వామ్యం అంటే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసే పాలనేనా! 

ముందుగా కేంద్రంలొని బిజెపితో పొత్తు. దాన్ని ప్రజలు కోరలేదు. జనసేన అధినేత తో మైత్రి. అదీ ప్రజలు కోరింది కాదు. అంతా తన వ్యూహమే. బిజెపితో స్నేహం నాలు గేళ్ళు పాడిగేదెలా ప్రయోజనాల పాలిచ్చింది.  కేంద్రం వద్దన్నా సుజానా చౌదరిని కేంద్ర మంత్రిగా సిఫారసు చేసి ఆపై తన కేంద్ర మంత్రుల పాపాలకు అడ్దుగా కేంద్రం నిలవకపోయినా వారిని ఇబ్బంది మాత్రం పెట్టలేదు. కేంద్ర మంత్రి సుజానా చౌదరికి ముఖ్యంగా మలేషియా బంక్ మరియు అంతర్జాతీయంగావచ్చిన ఇబ్బందుల నుండి తాత్కాలిక సహకారం అందించి ఆదుకొంది.

ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఉద్యమం వైసిపి సారధ్యంలో రాష్ట్రంలో ఊపందుకుందో అప్పుడు చంద్రబాబు యూ-టర్న్ తీసుకొన్నారు. అప్పుడు ఆయనకు ఎన్ డి ఏ నుండి బయట పడానికి కారణాలు వెతికారు. కారణం ప్రజాసేవ కాదు. ప్రజా ప్రయోజనాలు కూడా కాదు. పాలు పితుక్కున్నంత కాలం పితుక్కొని ఆ తరవాత కేంద్రం అనే గొడ్దు వట్తిపోయి  ఎండిపోయిన తరవాత ఇక ప్రయోజనాలు ఏవె ఉండవని అర్త్ధమైన తరవాత బయట పడ్దారన్నమాట.    

నాలుగేళ్లు నిర్విరామంగా స్వప్రయోజనాల పాలు పితుకుడు పని అనే పర్వంలో మునిగి తేలి, స్వంత సామాజికవర్గ మీడియా మద్దతుతో ఎప్పుడూ ఏదో రాష్ట్ర ప్రయోజనా ల కోసం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నట్లు నాటకాలాడి ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకున్నారు.  నరెంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విభజన ప్రయో జనాలు రాష్ట్రానికి అందించ కుండా చేయిచ్చిందని అందుమూలంగా రాష్ట్రం తీవ్రంగానష్టపోయిందని కేంద్రంపై ధర్మ న్యాయ పోరాటాలు చేశారు. దానికి 13జిల్లాల్లో  కోటానుకోట్ల రూపాయిల ప్రజాధనం నీళ్లపాలు చేశారు. 

నాలుగేళ్లలో ఒక్కసారి కూడా నరెంద్ర మోడీని ఆయన ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనని విమర్శించని చంద్రబాబు ఒక్కసారిగా తన మిత్రుడు బిజెపిని వీదుల్లొకి ఈడ్చి మొత్తం రాష్ట్ర అభివృద్ది వైఫల్యానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వమే కారణ మని తన కుట్ర పూరిత రాజకీయ కుతంత్రాన్ని బయటపెట్టారు.
"ఏదైనా పురోగతి కనిపిస్తే అదంతా నా మహిమ, తిరోగమనం కనిపిస్తే బిజెపి ద్రోహం" అంటూ జనాన్ని వంచింటం దానికి తన స్వకుల మద్దతు మీడియా ప్రతిధ్వనులతో ప్రచారం చేస్తూ కాలం గడపటం మినహా ఈ నాలుగేళ్ళు నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ప్రజా ధన వృధా తప్ప మరేమీ లేదు. ఈ వృధా తొలినుంచీ అరికట్తినా అద్భుత అమరావతి నగర శాశ్వత నిర్మాణాలు ఎంతో వైభవంగా జరిగి ఉండేవి. 

నాడు ధుర్యోధన సార్వభౌముడు శకుని సారధ్యంలో పాండవులను అడవిపాలు చేసినట్లు - కుతంత్రం కుయుక్తులు ప్రయోగిస్తూ ప్రతిపక్ష ఎమెల్యేలను బజారులో సరకులు కొన్నట్లు వారికి స్వార్ధ ప్రయోజనాలు ఎరవేసి వారిని తనపార్టీలోకి తెచ్చుకోగా - ఇక ప్రతిపక్షం ఎమి చేయగలుగుతుంది? శాసనసభ వదిలేసి జనారణ్యంలోకి వెళ్ళిపోయారు.


అధికార పార్టీ పూర్తిగా తలవంచి ప్రభుత్వ వ్యవస్థను నేఱగాళ్ళ పాలుజేసి తీరికగా కూర్చొని, ప్రతిపక్ష నిర్మూలనతో సభాపతి చోద్యం చూస్తుంటే, దానికి నాటి గుడ్దివాడైన ధృతరాష్ట్రునిలా ప్రజాస్వామ్యంపై జరిగే అత్యాచారానికి నిలువెత్తు సాక్ష్యంగా, శాసనసభే వేదికగా, ప్రజాస్వామ్య వస్త్రాపహరణం దిగ్విజయంగా జరిపించటం చూశారు. 
అలాంటి పాలకులకుడు నేడు ప్రజాస్వామ్య పరిరక్షణకోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా, ప్రతిపక్షాలను దేశవ్యాప్తంగా సమీకరిస్తానని వారి చుట్టూ తిరగటం సిగ్గుచేటని అనుభవఙ్జులైన రాజకీయ విశ్లేషకులు వేనోళ్లతో చెపుతున్నా వారి సామాజిక కులసేవే పరమార్ధంగా జీవించే మద్దతు మీడియా మాత్రం చంద్రబాబు, నరేంద్ర మోడీ పీఠాన్ని కదిలిస్తున్నారంటూ వీరలెవెల్లో ప్రచారం చేస్తుంది. దానికి పరిహారంగా ఆ మీడియాకు ₹700 కోట్ల ప్రజాధన సంతర్పణ జరిగి పోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మిత్రులంతా ఎదురు తిరిగినప్పుడే శత్రువులను మిత్రులుగా చేసుకోక తప్పదు. ఆ సమయంలో భారతావనిపై ధారుణ అకృత్యం, అత్యాచారం “ఎమర్జెన్సీ" పేరుతో జరిపిన కాంగ్రెస్ - దాని జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి అధికారదాహంతో గంగవెర్రులు ఎత్తిపోవటం కనిపించింది. ఇంకేం తన కొక శలభం దొరికింది అదే చంద్ర బాబుకి. ఎన్నికలలో గెలుపే పరమావధిగా భావించే చంద్రంబాబు తన కోసం బలై పోవటానికి “ఒక రాజకీయ పార్టీ మిత్రుడు” గా తోడై, ఆ తరవాత ఏకంగా ఏపి కాంగ్రెస్ నే సైకిల్ పార్టీకి బలిపశువుగా వధ్యశిలపై నిలబెట్టటానికి తయారయ్యేలా చేశాడు. 

ఎందుకంటే చంద్రబాబు తానెన్నడూ ఒంటరిగా గెలిచిందిలేదు. ప్రతిసారి తన గెలుపుకు ఎన్నికలప్పుడు మిత్రుడై, ఆ తరవాత తన వైఫల్యాలకు బలిపశువు కావటానికి సిద్ద మయ్యే "బకరా పార్టీ"ల సహకారంతోనే చంద్రబాబు రాజకీయం ఇంతకాలానికి ఈ స్థాయికి వచ్చింది. ఇది తెలుగు ప్రజలెరిగిన ఆయన చరిత్ర. కాలం చెప్పే నగ్న  సత్యం. అందుకే ఇప్పుడు, కాంగ్రేస్ తో, తన పార్టీతో సహా ఎవరూ కోరుకోని అనైతిక మైత్రికి, అనాగరిక సంసారం నెఱపటానికి చంద్రబాబు సిగ్గులేకుండా నగ్నంగా రంగం లోకి దిగాడు.

పార్టీ సభ్యులందరికి ప్రజాసేవ కంటే ఎన్నికల్లో గెలవటం ముఖ్యం అని చెప్పే ఆయన ప్రవచనాలు అనేక సందర్భాల్లో ప్రతి తెలుగువాడు విన్నాడు. ఇక చంద్రబాబు అవినీతి ఇంత స్థాయిలో బట్టబయలు అయినప్పుడు, కేంద్రం తాను రాజకీయ నిర్ణయం తీసుకోకపోతే దాన్ని కేంద్రం చేతగాని తనంగా, అలుసుగా భావించే పరిస్థితి వస్తుంది. 

బహిరంగంగా కర్ణాటకలో బిజెపి వైఫల్యం తన నిర్వాకం వలననే అని, తన మద్దతు మీడియాద్వారా చేసుకున్న ప్రచారం - కేంద్ర నేతల మదిలో ఉవ్వెత్తున ఆగ్రహం రేపింది. చంద్రబాబును క్షమించ కూడదన్న నిర్ణయానికి వచ్చేసింది. ఏమి జరిగినా రాష్ట్రంలో బిజెపికి వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేకపోవటం తో “పోట్లాడితే పోయేదేమీ లేదు అని గ్రహించి” సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంది. 

టిడిపి అధినేత తన రచన స్క్రీన్-ప్లే దర్శకత్వంతో మొదలెట్టి - బిజెపిపై నెట్టేద్దామని ఉద్దేశించిన “ఆపరేషణ్ గరుడ,ఆపరేషణ్ ద్రవిడ, ఆపరేషణ్ రావణ, ఆపరేషణ్ కుమర” తదితర పేర్లతో తనే సృష్టించిన వ్యూహం ఆపై దాని ద్వారా- ప్రతిపక్షనేతపై జరిగిన హాత్యా ప్రయత్నంతో మొత్తం దేశవ్యాప్తంగా తన పైకే బూమరాంగ్ అయింది. 
ఆదాయపన్ను శాఖ దాడుల్లో వేలకోట్ల "లెక్కలు చూపని ప్రజాధనం, పన్ను ఎగవేతలు" వంటివి తనకు, అతి సన్నిహితులైన వారి ఇలాఖాల్లో బయటపడగా సిగ్గు పడక పోగా - దాన్ని విడిచి బాబు బృందం చేస్తున్నయాగీని జనం గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోసం నిరీక్షిస్తున్నారు.   

దరిమిలా ఆంధ్రప్రదేశ్‌లో 'సిబీఐ కి నో ఎంట్రీ - జిఓ ఇచ్చి' సోదాలు చేపట్టే అధికారాన్ని సీబీఐకి నిరాకరిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోగుట్టు జనాని కి సంపూర్ణంగా అర్ధంకాగా దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాల  “సాధారణ అనుమతి” అవసరం. ఏపీలోకి సీబీఐ ప్రవేశానికి వెసులు బాటు కల్పించే ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ  నేతల నివాసాలు, కార్యాలయాల్లో ఇటీవలి ఐటి శాఖ సోదాలు, భవిష్యత్తులో మరిన్ని సోదాలు జరుగుతాయనే భయాల నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతున్నది.

సీబీఐ తన అధికారాలను వినియోగించుకోనేందుకు గతంలో ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ ను ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసిన ఫలితంగా అక్కడ కేంద్ర ప్రభుత్వశాఖలు, కేంద్రప్రభుత్వ రంగసంస్థల్లోపనిచేసే ఉద్యోగుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసే అవకాశం సీబీఐకి ఉండదు. సీబీఐ పరిధి రద్దవుతుంది. ఇకపై ఏపీలో సీబీఐ పాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఏసీబీ పోషిస్తుంది. ఖేంద్రం నుండి రాష్ట్రానికి దిగుమతయ్యే యుపిఎస్సి నియమిత అధికారుల - పాపాలు బట్తబయలును అడ్డుకొనే ఈ నిర్ణయం వెనుక – తను, తన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, గుత్తేదార్లు తదితరులని బినామీలుగా మార్చుకున్న వైనం అందులో ఇమిడిన స్వార్ధం బయటపడే ఎపిసోడును  నిరోధించటమే ఈ నిర్ణయ ఉద్దేశం. ఇదే ఈ నిర్ణయం వెనుక అసలు మతలబని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

అవినీతి కేసుల విషయంలో చంద్రబాబు భయపడుతున్నారని, వాటినుంచి తప్పించు కునేందుకు, తమ నేతలపై సోదాలు జరుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నాయకులు, మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఈ ప్రభుత్వ - జిఓ - ఏ మేరకు న్యాయబద్ధమైనదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐకి ఇచ్చిన అనుమతిని ఏపీ ఎందుకు రద్దు చేసిందో చెప్పగలగాలి. ఒక సంస్థ పై ఆరోపణలు వస్తే ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనటం సరికాదు. డాక్టర్ బాగాలేడని దవాఖానను మూసేస్తామా? అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

అక్రమ సంపాదన ఆర్జించేవారికి కొమ్ముకాయటానికి, అవినీతిని ప్రోత్సహించేందుకే ఏపీ ముఖ్యమంత్రి ఈ చర్యకు పాల్పడ్డారు. అవినీతికి పాల్పడటం బయటపడకుండా ఉండడం ఎలా అనే డాక్యుమెంట్ బాబు రాసుకోవాలి అని - జీవీఎల్ నరసింహారావు ఎద్దేవాచేశారు.

ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానం. కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్థల్లో చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై సీబీఐ సోదాలు నిర్వహించవచ్చుఅని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడని చేసిన ఈ నిర్ణయం దొపిడీకి ముఖ ద్వారాలు తెరిచినట్లేనని – ఆయన అవకాశవాదానికి అడ్డూ అదుపులేదని, సీబీఐ పేరు చెప్తే చంద్రబాబు వణికిపోతున్నారు అని వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి, బుగ్గన ఎద్దేవాచేశారు.

“ఓటుకు నోటు కేసు” భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి త్రెలుగు జాతి మొత్తం ఒక దశాబ్ధం కలసి జీవించే అందివచ్చిన అవకాశం వదిలి పెట్టటం చూస్తే - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అనిపిస్తుందని - బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ, వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు స్వయంగా నిర్వీర్యం చేస్తూ-నరేంద్ర మోడీపై నెట్టేస్తున్నారని మండిపడ్డారు.

ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి దండేసి దండం పెట్టి, ఆయనను ప్రశంసించి, సన్మానించి వచ్చిన ఏకైక పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే మాత్రమే అని అంటోంది నేషనల్ మీడియా. 

రాహుల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడే అయినా - ఆయనను సీరియస్ గా తీసుకుంటున్నది ఆయన పార్టీలోని భజనపరులే తప్ప బయటి వాళ్లు ఏవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. ఆఖరికి కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్న ఇతరపార్టీల అధినేతలు కూడా రాహుల్ గాంధిను సీరియస్ గా తీసుకోవడం లేదు, ఇదెందుకో చెప్పనక్కర్లేదు, రాహుల్ గాంధి నేషనల్ లెవల్లో  నేషనల్ పప్పు గా పేరుపొందాడు.

ఇక రాహుల్ గాంధికి ఉన్న మాస్ ఇమేజ్, నాయకత్వ పటిమ అనేవి కూడా అంరదికీ తెలిసినవే. ఈ నేఫథ్యంలో దేశంలోని ఏ రాజకీయ పార్టీ అధినేత, కాస్త జనాల్లో పట్టు న్న వాళ్లెవ్వరూ రాహుల్ గాంధి ని పట్టించుకోవడం లేదు. కానీ సరాసరి రాహుల్ గాంధి ఇంటికి వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాడు చంద్రబాబు నాయుడు.

కాంగ్రెస్ తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న నేతలు డైరెక్టుగా ఏదైనా మాట్లాడకుండా ఆయన మాతృమూర్తి సోనియాగాంధీ తో మాట్లాడుతున్నారు. ఆమె పార్టీ అధ్యక్ష హోదాలో లేకపోయినా వారు మాట్లాడాలంటే సోనియాగాంధితో మాట్లాడటం లేకపోతే అన్నీమూసుకొని ఉండటం చేస్తున్నారు. అంతే కానీ, రాహుల్ గాంధిని పట్టించుకోవడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో రాహుల్ గాంధీను వెళ్లి కలిశాడు చంద్రబాబు నాయుడు. ఈ తీరును ఇతర జాతీయపార్టీల నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట. రాహుల్ గాంధీ ముందే చంద్రబాబు నాయుడు సాగిలాపడుతున్న తీరును చూసి చంద్రబాబును కూడా వారు లైట్ తీసుకున్నారని సమాచారం.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, జాతి జనులనుండి, మరీ ముఖ్యంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ఆమె ట్విట్టర్ లో ఓ కామెంట్ పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ అడుగుపెట్టకుండా ఆ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను మమతా సమర్థించారు. అందుకు అనుగుణంగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. అంతే మమతా బెనర్జీ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. "చంద్రబాబు తో కలసి మీరందరూ దేశాన్ని లూటీ చేస్తారా?" అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

మమతా ట్వీట్ కు సమారు 500 వందల కామెంట్లు వస్తే అందులో దాదాపు 480 వరకూ మమతా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చినవే ఉండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అది తమ సొంత రాజ్యం అనుకుంటున్నారా? అంటూ మరికొంత మంది మమతా బెనర్జీని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా కేంద్రం మాట్లాడ కూడదని చెప్పదలచుకున్నారా? అంటూ మండిపడ్డారు. కోల్ కతాలో జరిగిన శారదా చిట్ ఫండ్ స్కామ్  అంశాన్ని కూడా కొంత మంది ప్రస్తావించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: