ఇంటర్నేషనల్ స్థాయిలో ఏపీ రాజధాని ఆర్థిక నేరం..?

KSK
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటూ ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సుజనా చౌదరి పై ఈడి దాడి చేసి అనేకమైన అవినీతి సొమ్మును బయటకు తీయడం తో ఇప్పటికే తల పట్టుకున్న చంద్రబాబు కి మరొక తలనొప్పి అంటుకొంది.


ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని సింగపూర్‌ కంపెనీలకు అమ్మేశారని మాజీ ఎమ్.పి జివి హర్షకుమార్‌ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా అమ్మడం దారుణమన్నారు. అమరావతి నిర్మాణం పేరిట జరుగుతున్న దోపిడిపై ప్రధానికి పిర్యాదు చేస్తానని తెలిపారు.


సీఎం బినామీలు, పార్టీ నాయకుల కోసమనే విధంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను కబ్జాలు చేసి, టీడీపీ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాలుపడుతోందని ధ్వజమెత్తారు.


చంద్రబాబు ప్రభుత్వం దళితులను అణిచి వేస్తోందని, అలాంటి టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటంటూ విమర్శించారు. ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన నాయకులు విభజన తో కూడిన నష్టపోయిన రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయగలరు అంటూ విమర్శల వర్షం కురిపించారు. రానున్న రోజుల్లో ఇలానే పాలన కొనసాగితే రాష్ట్రంలో ఉన్న ప్రజలు వలసలకు వెళ్లిపోవడం ఖాయమని మరి కొంతమంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: